థాయ్ లాండ్ ఓపెన్: రెండో రౌండ్లో ఓడిపోయిన సైనా

థాయ్ లాండ్ ఓపెన్లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు అంతా ఓటమితో వెనుదిగారు. యోనెక్స్ థాయ్ లాండ్ ఓపెన్ సూపర్ 1000 ఉమెన్స్ రెండో రౌండ్లో సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. స్థానిక షట్లర్ వరల్డ్ 12వ ర్యాంకర్ బుసానన్ చేతిలో 23-21, 14-21, 16-21 తేడాతో పోరాడి ఓడింది.

మరోవైపు పురుషుల సింగిల్స్ లో రెండో రౌండకు చేరుకున్న మాజీ ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ వాకోవర్ ప్రకటించాడు. మలేసియా ఆటగాడు లీ జి జియాతో అతడు తలపడాల్సింది. కుడికాలి పిక్క కండరాలు పట్టేయడంతో ఆట నుంచి తప్పుకున్నాడు. అంతకుముందు పురుషుల సింగిల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 19-21, 17-21 తేడాతో ఇండోనేసియా ద్వయం మహమ్మద్ ఆహ్సన్, హెండ్రా సెతియవన్ చేతిలో ఓటమి పాలైంది.

Latest Updates