జూనియర్ క్రికెట్ లో అదరగొడుతున్న హైదరాబాదీ

మిడిల్‌‌క్లాస్‌‌ ఫ్యామిలీ. స్పోర్ట్స్‌‌ బ్యాక్‌‌గ్రౌండ్‌‌ లేదు. అయినా చిన్నప్పటి నుంచి క్రికెట్‌‌ అంటే పిచ్చి. స్కూల్‌‌కు వెళ్లి చదువుకోవడం కంటే గ్రౌండ్‌‌కు వెళ్లి ఆడుకోవడమే ఇష్టం. బంతిని బలంగా బాదడం.. సెంచరీల మీద సెంచరీలు చేయడం ఇంకా ఇష్టం. ఆ ఇష్టానికి పేరెంట్స్‌‌ సపోర్ట్‌‌.. మంచి కోచింగ్‌‌ తోడవడంతో తిలక్‌‌ వర్మ అనతికాలంలోనే హైదరాబాద్‌‌ క్రికెట్‌‌లో సెన్సేషనల్‌‌ క్రికెటర్‌‌గా మారిపోయాడు. సురేశ్‌‌ రైనాను ఇష్టపడే ఠాకూర్‌‌.. అతని మాదిరిగా లెఫ్టాండ్‌‌ బ్యాటింగ్‌‌ చేస్తాడు. చక్కటి కవర్‌‌ డ్రైవ్స్‌‌, స్ట్రెయిట్‌‌ డ్రైవ్స్‌‌తో ఆకట్టుకుంటాడు. ఎలాంటి బౌలింగ్‌‌ను అయినా అలవోకగా ఎదుర్కొంటాడు. మంచి హైట్, ఫిట్‌‌నెస్‌‌.. ఎంత ప్రాక్టీస్‌‌ చేసినా అస్సలు అలసిపోని శరీరం.. ఎన్ని గంటలు బ్యాటింగ్‌‌ చేసినా, ఎన్ని పరుగులు సాధించినా ఆగిపోని తత్వం తిలక్‌‌ను స్పెషల్‌‌గా నిలుపుతాయి. ఇలాంటి టాలెంట్‌‌తోనే టాపార్డర్ బ్యాట్స్‌‌మన్‌‌గా స్టేట్‌‌ లెవెల్‌‌లో అన్ని ఏజ్‌‌ గ్రూప్‌‌ల్లో సెంచరీల మోత మోగించిన ఈ యువ క్రికెటర్‌‌ ఏడాదిన్నరగా నేషనల్‌‌ అండర్‌‌–19 టీమ్స్‌‌లో రెగ్యులర్‌‌ మెంబర్‌‌గా ఉన్నాడు.

చిన్నప్పటి నుంచి తిలక్‌‌‌‌కు క్రికెట్‌‌‌‌ తప్ప వేరే వ్యాపకం లేదు. ప్రైవేట్‌‌‌‌ ఎలక్ట్రికల్‌‌‌‌ కంపెనీలో పని చేసే తండ్రి, గృహిణి అయిన తల్లి ప్రోత్సహించడంతో పదేళ్ల వయసులో తిలక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ను సీరియస్‌‌‌‌గా తీసుకున్నాడు. సమ్మర్‌‌‌‌ కోచింగ్‌‌‌‌ క్యాంప్స్‌‌‌‌లో పాల్గొంటూ టెన్నిస్‌‌‌‌ బాల్‌‌‌‌తో బేసిక్స్‌‌‌‌ నేర్చుకున్నాడు. ఓ క్యాంప్‌‌‌‌లో కోచ్‌‌‌‌ సలామ్​ బయాష్​ దృష్టిలో పడడం ఠాకూర్‌‌‌‌ కెరీర్‌‌‌‌లో టర్నింగ్‌‌‌‌ పాయింట్. టెన్నిస్‌‌‌‌ బాల్‌‌‌‌తో తిలక్‌‌‌‌ ఆట చూసి ఇంప్రెస్‌‌‌‌ అయిన సాలమ్.. అతనిలో స్పార్క్‌‌‌‌ను గమనించాడు. కోచింగ్‌‌‌‌ ఇస్తే మంచి క్రికెటర్‌‌‌‌ అయ్యే సత్తా అతనిలో ఉందని గుర్తించాడు. అకాడమీలో చేర్పించమని తిలక్‌‌‌‌ తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు సరే అన్నారు. అప్పటి నుంచి బార్కస్‌‌‌‌లో తన ఇంటి నుంచి రోజు శేరిలింగంపల్లిలోని లేగలా అకాడమీకి రావడం..
ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు దాకా కోచ్‌‌‌‌ ఏం చెబితే అది చేయడం.. తిలక్‌‌‌‌ దినచర్య. ఎన్ని గంటలు ప్రాక్టీస్‌‌‌‌ చేసినా కూడా అస్సలు అలసిపోయే వాడు కాదు. దాంతో ఏడాది తిరిగేలోపే అతను అండర్‌‌‌‌-14 స్టేట్‌‌‌‌ టీమ్‌‌‌‌కు సెలెక్టయ్యాడు. ఆడిన తొలి సీజన్‌‌‌‌లోనే బెస్ట్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ అవార్డు రావడంతో తిలక్‌‌‌‌లో కాన్ఫిడెన్స్‌‌‌‌ పెరిగింది. ఇక, ఐపీఎల్‌‌‌‌ సందర్భంగా పలువురు ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెటర్లను కలిసే చాన్స్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌కు దక్కింది. కోచ్‌‌‌‌ బయాష్‌‌‌‌ ఓసారి మైక్‌‌‌‌ హస్సీతో మాట్లాడించాడు. అక్కడి నుంచి తిలక్‌‌‌‌లో ఉత్సాహం రెట్టింపైంది.

Latest Updates