అదంతా ఫేక్.. అజిత్ కు సోషల్ మీడియా నచ్చదు

సోషల్​ మీడియా వచ్చాక చిన్నా పెద్దా తేడా లేకుండా పోయింది. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్​ అంటూ అందరూ అకౌంట్​ తెరుస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ వారు సైతం అప్​డేట్స్‌‌ను ఎప్పటికప్పుడు పోస్ట్​ చేస్తూ యాక్టివ్‌‌గా ఉంటున్నారు. కానీ  సోషల్​ మీడియాకి దూరంగా ఉండేవాళ్లూ ఉన్నారు. వాళ్లలో  అజిత్​ ఒకరు. టాలీవుడ్​, కోలీవుడ్​, బాలీవుడ్​.. ప్రతి చోటా అజిత్​ని అభిమానించే వాళ్లు కోకొల్లలు. అలాంటిది ఆయన సోషల్​ మీడియాలో యాక్టివ్‌‌గా లేకపోవడం, తన సినిమాల తాలూకు అప్​డేట్స్​ ఇవ్వకపోవడం గురించి అభిమానులు నిరాశకు గురవుతున్నా అది తన వ్యక్తిగత విషయం కనుక ఆయన ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఈ మధ్యనే ‘నేను త్వరలో సోషల్​ మీడియాలో ఎంటర్​ అవబోతున్నా.. నేను కూడా నా సినిమాలు.. వ్యక్తిగత విషయాలు మీతో షేర్​ చేసుకుంటా’ అంటూ ఆయన సంతకంతో ఉన్న లెటర్​ హెడ్​ ఒకటి సోషల్​ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. అది చూసిన ఫాన్స్ ఎగిరి గంతేశారు.. కానీ ఇంతలోనే ‘అది ఫేక్​ న్యూస్​, అసలు అజిత్‌కి సోషల్​ మీడియా అంటే ఇష్టం ఉండదు. ప్రస్తుతం మీడియాలో ప్రచారం అవుతున్న లెటర్​ ఫేక్​. ఆయన పేరుతో ఏ అకౌంటూ  లేదంటూ అజిత్​ పీఆర్​ టీమ్​ కచ్చితంగా చెప్పేసింది. మరి ఒరిజినల్​ సిగ్నేచర్‌‌‌‌తో ఉన్న ఆ లెటర్​ హెడ్​  ఎలా బయటకు వెళ్లిందో మాత్రం తెలియాల్సి ఉంది. కానీ అజిత్ అభిమానులు చాలా నిరాశ పడ్డారన్నది మాత్రం నిజం.

Latest Updates