భారీ విరాళం ప్ర‌క‌టించిన త‌మిళ హీరో విజ‌య్

కరోనా మహమ్మారిని అరిక‌ట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి త‌న వంతు సాయం అందించారు ప్ర‌ముఖ త‌మిళ హీరో విజయ్‌. క‌రోనా నియంత్రణ చర్యలకు రూ. 1.3 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. తాను ప్ర‌క‌టించిన భారీ విరాళంలో కేంద్ర ప్రభుత్వ సహాయనిధికి (PM-CARES) రూ.25 లక్షలు, తమిళనాడు సీఎం స‌హాయ నిధికి రూ.50 లక్షలు, దక్షిణ భారత నటుల సంఘానికి(FEFSI) రూ.25 లక్షలు, కేరళ సీఎం స‌హాయ నిధికి రూ.10 లక్షలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, పుదుచ్చేరి ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 5 లక్షల చొప్పున అందజేయనున్నట్టు విజ‌య్ తెలిపారు.

Latest Updates