బిగిల్ మూవీ యూనిట్ కి గోల్డ్ రింగ్స్ 

హీరో విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు. సెట్లోకి అడుగుపెట్టగానే తన స్టార్ డమ్ ను పక్కన పెట్టేసి, ఆ యూనిట్ సభ్యులందరితోను ఆయన ఆత్మీయంగా కలిసిపోతాడు. వాళ్ల  బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అందువలన ఆయన సినిమాకి ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేస్తారు.

ఇందులో బాగంగానే ఆయన ప్రతీ సినిమా పూర్తయిన తర్వాత… సినిమా కోసం కష్టపడిన వాళ్లందరికి ఆయన ఏదో రూపంలో గిఫ్ట్ లు ఇస్తుంటాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘బిగిల్’ మూవీ రీసెంట్ గా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగు పూర్తికాగానే, యూనిట్ సభ్యులందరికీ సినిమా టైటిల్ తో ఉన్న గోల్డ్ రింగ్స్ ను విజయ్ అందజేశాడు. దాంతో యూనిట్ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ గా నయనతార నటించిన ఈ సినిమా ‘దీపావళి’కి విడుదల కానుంది.