16 సీట్లు గెలిపిస్తే 216 చేసే శక్తి కెసిఆర్ కు ఉంది: తలసాని

ఏపీ రాజకీయాలు కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆర్ కనబడుతున్నారని సెటైర్లు వేశారు. ఆంధ్రా వాళ్ళను కొడుతున్నారు, వారి ఆస్తులు లాక్కుంటున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. అసలు హైదరాబాద్ లో ఎక్కువ ఆస్తులు ఉన్నది చంద్రబాబుకే అన్నారు. యువతకు రోల్ మోడల్ కేటీఆర్ అని.. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత రాజకీయాల్లో ముందుకెళుతోందన్నారు. 2014 లో ఏదో ఉద్ధరిస్తాడని మోదీని గెలిపిస్తే ఏం చేయలేదన్నారు. హైదరాబాద్ కు మోదీ ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పగలరా అని తలసాని ప్రశ్నించారు. 16 సీట్లు గెలిపిస్తే 216 చేసే శక్తి కెసిఆర్ కు ఉందన్నారు. కాంగ్రెస్, బిజెపి భూతాలను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని విమర్శించారు.

Latest Updates