వంశపారంపర్య హక్కులు కల్పించిన సీఎం జగన్ కు కృతజ్ణతలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చిలుకూరు బాలాజీ టెంపులు ప్రధాన అర్చకులు రంగరాజన్. శ్రీవారి ఆలయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని దర్శనాలు కల్పిస్తున్నారో ప్రత్యక్షంగా చూడాలని వచ్చినట్లు తెలిపారు. బాలాజీ టెంపులో కూడా ఇలాంటి పద్దతులు అవలంభించే ఆలోచనలో ఉన్నామన్నారు.

లిక్విడ్ ఓజోన్ కు చిలుకూరులో ఇన్ స్టాల్  చేశామని తెలిపారు రంగరాజన్. కరోనాతో కలిసి సంసారం చేయాలి కాబట్డి ఇది రక్షగా  ఉంటుందన్నారు. ప్రతి సారీ సానిటైజ్ చేయడం కుదరదు, దీన్ని పీల్చుకోవచ్చు, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చన్నారు. భక్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నా ఆయన..మిగతా ఆలయాలలో వీటిని ఉపయోగిస్తే బాగుంటుందని తెలిపారు.

మరోవైపు వంశపారంపర్య హక్కు విశయంపై మాట్లాడిన రంగరాజన్… ఇది ఒక్క అర్చకులకే కాదు, ఎన్నో కుల వృత్తుల వారు తరతరాలుగా స్వామి వారి సేవలో ఉన్నారని తెలిపారు. కుల వృత్తుల ప్రభావం  తెలియకుండా 1987 లో అప్పటి ప్రభుత్వం తీసేసింది. మళ్లీ ఇప్పుడు వంశపారంపర్య హక్కులు కల్పించిన ఏపీ సీఎం జగన్ కు కృతజ్ణతలు తెలిపారు. అన్నమయ్య వంశస్తులు, నాయీ బ్రాహ్మణులకు త్వరలో వంశపారంపర్య హక్కులు కల్పిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు రంగరాజన్.

Latest Updates