గణేష్ ఉత్సవాలకు కృషి చేసిన పోలీస్ శాఖకు కృతజ్ఞతలు

గణేష్ ఉత్సవాలను సజావుగా కొనసాగేందుకు కృషి చేసిన డీజీపీ, కమిషనర్ కు …సమైక్యాంద్ర పరిరక్షణ సమితి హైదరాబాద్ లో పాలాభిషేకం చేశారు. వినాయక మహోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు కుమార్ చౌదరి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

భారతదేశ ప్రజలను స్వతంత్ర సంగ్రామంలో ఐక్యమత్యం చేస్తూ… మన సంస్కృతి సంప్రదాయ మూలాలను మర్చిపోకుండా ఉండేందుకు గణేష్ ఉత్సవాలను… లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారని పేర్కొన్నారు. తీవ్రమైన కరోనా కల్లోల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఇలాంటి తరుణంలో పోలీసు యంత్రాంగం ప్రదర్శించిన తీరును ప్రశంసిస్తూ… హైదర్ గుడ లో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Latest Updates