
ఓ మండలాధికారి జాతీయగీతాన్ని సెల్ఫోన్లో చూస్తూ పాడాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన జనగామ జిల్లాలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జరిగింది. తరిగొప్పుల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జాతీయజెండాను ఎంపీడీవో ఇంద్రసేనారెడ్డి ఎగురవేశారు. అనంతరం అందరూ జాతీయగీతాన్ని పాడుతుంటే.. అక్కడే ఉన్న ఓ అధికారి మాత్రం ఫోన్ చూస్తూ జాతీయ గీతాన్ని చదివాడు. వేడుకలకు వచ్చిన గెస్టులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ చూస్తుండగానే ఆ అధికారి జాతీయ గీతాన్ని సెల్ ఫోన్లో చూస్తూ చదివారు. ప్రజాపరిపాలనను నడిలించాల్సిన వీరే జాతీయ గీతాన్ని ఫోన్లో చూసి పాడటం విడ్డురంగా అనిపిస్తోంది. ఇది చూసిన ప్రజలు సెటైర్లు వేస్తూ నవ్వుకుంటున్నరు.
For More News..