ఆ ఫామ్ హౌస్ నాది కాదు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ శివార్లలోని జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్​ తనదికాదని, తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నా రని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. రూల్స్​ ఉల్లంఘించి కేటీఆర్​ ఫామ్ హౌస్ కట్టుకున్నారంటూ కాంగ్రెస్​ ఎంపీ రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేయడం, దానికి సంబంధించి తనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్​ ట్వీట్ చేశారు. ‘‘ఓ కాం గ్రెస్ నాయకుడు నాపై ఎన్జీటీలో కేసు వేయడం ఉద్దేశపూర్వకమే. గతంలో చెప్పినట్లుగా ఆ ఫామ్ హౌస్ నాది కాదు. నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే. సరైన న్యాయ సలహాలు తీసుకొని నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తాను’’ అని ఆయన చెప్పారు.

Latest Updates