తెలంగాణ పోలీసులది టైమ్లీ యాక్షన్​​​​

బెంగళూరు: దిశ కేసులో నిందితుల ఎన్​కౌంటర్​పై సెకండ్​ ఒపీనియన్​కు చాన్సే లేదని బెంగళూరు సిటీ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ భాస్కర్​రావు అన్నారు. దిశ ఘటన తర్వాత బెంగళూరులో మహిళల సెక్యూరిటీకి భరోసా కల్పిస్తూ ‘100కు ఫోన్​ చేస్తే 7 సెకన్లలో స్పందిస్తాం’ అని ప్రకటించారు. హైదరాబాద్ ఎన్​కౌంటర్​పై మీడియాతో మాట్లాడిన ఆయన.. సైబరాబాద్ కమిషనర్​ సజ్జనార్​ కర్నాటక వాసే అని గుర్తుచేశారు. ‘తెలంగాణ పోలీసులది సరైన, టైమ్లీ యాక్షన్. పోలీసుల చేతుల్లో ఆయుధాలు లాకున్న నిందితులు పారిపోయి ఉంటే.. డిపార్ట్​మెంట్​పై భయంకరమైన ప్రెజర్​ వచ్చుండేది. ఈ ఎన్​కౌంటర్​పై రెండో ఒపీనియన్​ అవసరమేలేదు’ అన్నారు.

రెండింటినీ కలిపి చూడొద్దు: ఏసీపీ
బెంగళూరు సిటీకే చెందిన ఏసీపీ హేమంత్​ నింబాల్కర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘‘దిశ కేసును ఎన్​కౌంటర్​ ఘటనతో కలిపి చూడొద్దు. ‘ నేరం చేసినందుకు చంపేశారు’ అని తీర్మానించడం సరికాదు. తెలంగాణ పోలీసుల చర్యపై చట్టపరమైన పరిశీలన జరుగుతుంది’’ అన్నారు.

Latest Updates