రాహుల్ సంగతి కోహ్లీ చూసుకుంటాడు: దాదా

న్యూఢిల్లీ: టీమ్‌‌లో కేఎల్‌‌ రాహుల్‌‌ బాధ్యతేంటి అనే విషయాన్ని కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ చూసుకుంటాడని బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ అన్నాడు. అంతేకాక లిమిటెడ్‌‌ ఓవర్లలో  రాణిస్తున్న రాహుల్‌‌ టెస్ట్‌‌ల్లో కూడా సత్తా చాటాలని దాదా ఆకాంక్షించాడు. కివీస్‌‌తో జరిగిన ఫస్ట్‌‌ టీ20లో రిషబ్‌‌ పంత్‌‌ బెంచ్‌‌కు పరిమితమవ్వగా రాహుల్‌‌ కీపింగ్‌‌ చేశాడు. ఈ అంశంపై దాదా మాట్లాడుతూ..   ‘ఫైనల్‌‌ ఎలెవెన్‌‌లో ఎవరుండాలనేది పూర్తిగా కెప్టెన్‌‌ నిర్ణయం. కెప్టెన్‌‌, టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కలిసి రాహుల్‌‌ బాధ్యతను డిసైడ్‌‌ చేస్తారు. వన్డేలు, టీ20లో కేఎల్‌‌ బాగా ఆడుతున్నాడు. టెస్ట్‌‌ల్లో కూడా రాణించాలని కోరుకుంటున్నా. టీ20 వరల్డ్‌‌కప్‌‌లో వికెట్‌‌ కీపర్‌‌ ఎవరనేదానిపై సెలెక్టర్లు, కెప్టెన్‌‌, టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కలిసి నిర్ణయం తీసుకుంటుంది’ అని అన్నాడు.

Latest Updates