విపక్షాల ఆందోళ‌న‌ల‌ మధ్యే వ్యవసాయ బిల్లుకు ఆమోదం

న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళ‌న‌ల‌ మధ్యే రాజ్య సభలో వ్యవసాయబిల్లుకు ఆమోదం తెలిపింది. విపక్షపార్టీల సభ్యులు పోడియం వద్దే నిలబడి ఆందోళనకు దిగారు.వాయిస్ ఓటు ద్వారా రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు పెద్దల సభ ఆమోదం తెలిపింది. రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని, వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ బిల్లులపై చర్చ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ బిల్లులను వైసీపీ, బీజేడీలు మినహా ఇతర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆకాలీదళ్, ఆప్, టీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్ద నిలబడి ఆందోళనకు దిగారు.అంతకుముందు విపక్ష సభ్యులు ఈ బిల్లు ప్రతును చింపి విసిరేశారు. డిప్యూటీ ఛైర్మెన్ మైక్ ను లాగేందుకు ప్రయత్నించారు.ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తీవ్ర గందరగోళం మధ్య డిప్యూటీ చైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తర్వాత విపక్షాల నినాదాల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోద ముద్రవేశారు. అనంతరం సభను సోమవారాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Latest Updates