ప్రధాని ‘ఖేల్‌‌ ఇండియా’ ఓపెనింగ్‌‌కు వస్తే అడ్డుకుంటాం.

గౌహతి: జనవరి 10 నుంచి ఇక్కడ జరగబోయే ‘ఖేలో ఇండియా’ గేమ్స్​ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆల్‌‌ అస్సాం స్టూడెంట్స్‌‌ యూనియన్‌‌ (ఏఏఎస్‌‌యూ) ఆర్గనైజేషన్‌‌ నేతలు ఆదివారం హెచ్చరించారు. జనవరి 5న ఇండియా, శ్రీలంక టీ 20 మ్యాచ్‌‌, 10 నుంచి 22 వరకు జరిగే ఖేలో ఇండియా గేమ్స్‌‌ మీద దృష్టి సారించామని మీడియాతో చెప్పారు. “ సిటిజిన్‌‌ షిప్‌‌ అమెండ్‌‌మెంట్‌‌ యాక్ట్‌‌ తర్వాత మోడీ తొలిసారి అస్సాం పర్యటనకు వస్తున్నారు. ఆయన వస్తే కచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ప్రజలను డైవర్ట్‌‌ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిపైనా దృష్ట పెట్టాం” అని ఏఏఎస్‌‌యూ ప్రెసిడెంట్‌‌ దీపాంక కుమార్‌‌‌‌నాథ్‌‌ చెప్పారు. అస్సాంలో రెండు గేమ్స్‌‌ను నిర్వహిస్తున్నారని, వాటిపై కచ్చితంగా నిఘా పెడతామని ఆర్గనైజేషన్‌‌ చీఫ్‌‌ అడ్వైజర్‌‌‌‌ సముజ్జల్‌‌ కుమార్‌‌‌‌ భట్టాచార్య చెప్పారు. నిఘా పెట్టడం ఏంటో టైం వచ్చినప్పుడు తెలుస్తుందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.

 

Latest Updates