ఏపీలో రూ.25కే కిలో ఉల్లి

రేటు తగ్గే వరకు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశం

అమరావతి, వెలుగు: రిటైర్ మార్కెట్ లో ఉల్లి రేటు పెరగడంతో కిలో రూ.25కే అందించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. రైతు బజార్లలో సబ్సిడీ రేటుతో ఉల్లి అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉల్లి రేటు పెరుగుదల, సప్లయ్ పై మంగళవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన రివ్యూ చేశారు. గత నెల 2 నుంచి సబ్సీడీ ఉల్లి అందిస్తున్నట్లు అధికారులు జగన్ కు చెప్పారు. ఉల్లి ధర కిలో రూ.90కి చేరిన రోజే 548 క్వింటాళ్లను రైతు బజార్లలో అమ్మినట్టు  తెలిపారు. పక్క రాష్ర్టాల నుంచి ఉల్లి కొనుగోలు చేసి కిలో రూ. 25కే విక్రయించాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఉల్లి అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించాలని సూచించారు. రిటైల్ మార్కెట్ లో ఉల్లి రేటు తగ్గే వరకు సబ్సీడీ ఉల్లి కొనసాగించాలన్నారు. సబ్సీడీ ఉల్లి సరఫరాతో ప్రభుత్వం కేజీ ఉల్లిపై రూ. 50 భరిస్తుందని, ఖజనాపై రూ.5.83 కోట్ల భారం పడుతుందన్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీ నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు వెయ్యి క్వింటాళ్లకు తగ్గకుండా ఉల్లి సేకరించి మార్కెటింగ్‌‌‌‌ శాఖ ద్వారా రైతు బజార్లకు తరలించాలన్నారు. మరోవైపు కర్నూలు హోల్​సేల్​ మార్కెట్ లో క్వింటా ఉల్లి రూ.10,200  పలికింది.

The AP government has decided to provide Kg onions per Rs.25

Latest Updates