గల్వాన్‌లో గరం తగ్గ‌లే

ఓ వైపు చర్చలు.. మరోవైపు బలగాల మోహరింపు
ఎల్‌‌ఏసీకి అటు ఇటు వెయ్యి మంది సైన్యం
ఆర్టిలరీ గన్స్‌, యుద్ధ ట్యాంకులను రెడీగా ఉంచిన ఆర్మీ, పీఎల్‌‌ఏ
రంగంలోకి మౌంటెన్ ఫోర్స్
న్యూఢిల్లీ: లడఖ్‌లోని గల్వాన్ వ్యాలీలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌‌ఏసీ) వద్ద టెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఎల్‌‌ఏసీకి ఇటు మన ఆర్మీ, అటు చైనా పీపుల్స్ లిబ‌రేషన్ ఆర్మీ(పీఎల్ఏ) తమ బలగాలను మోహరించాయి. ఇరువైపులా వెయ్యేసి మంది సైనికులు రెడీగా ఉన్నారు. రెండు వైపులా ఆర్టిలర్టి రీగన్స్, యుద్ధ ట్యాంకులను కూడా మోహరించారు. గల్వాన్ పాంగోంగ్ త్సో లోని పెట్రోల్ పాయింట్ (పీపీ) 14కు కొన్ని మీటర్ల‌ దూరంలోనే వీళ్లంతా ఏ క్షణంలోనైనా యుద్ధ రంగంలోకి దూకేందుకు రెడీగా ఉన్నాయి. దీంతో అక్కడ ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ‘‘జూన్ 15 ఘర్ష‌ణల త‌ర్వాత సరిహద్దుల్లో ఎలాంటి హింస జరగలేదు. అయితే ప్రస్తుతానికి సరిహద్దుల్లో ఏ మార్పు లేదు. పరిస్థితి టెన్షన్ ‌‌గానే ఉంది. ఒకరిపై మరొకరికి ఇంకా నమ్మకం కుదరలేదు. ఈ పరిస్థితుల్లో బలగాలను వెనక్కి తీసుకునే సూచనలు కనిపించడం లేదు. గల్వాన్, పాంగోంగ్‌‌
త్సోలలో రెండు దేశాలు పెద్ద ఎత్తున సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులు, ఆర్టిలర్టి రీ గన్స్‌‌, యుద్ధ వాహనాలను రెడీగా ఉంచాయి” అని అధికార వర్గాలు తెలిపాయి.

ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు

సరిహద్దుల్లో టెన్షన్ ‌‌నేపథ్యంలో అన్ని మిలిటరీ ఆప్షన్లను మన దేశం సిద్ధం చేస్తోంది. ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. పాంగోంగ్‌ త్సో లేక్ దగ్గర చైనాబలగాలను కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. మన కంట్రోల్‌‌లో ఉన్న ఫింగర్ 4లో తిష్ట వేసిన చైనా ఆర్మీని వెనక్కి పంపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎల్‌‌ఏసీ దగ్గర మిగతా ప్రాంతాల్లోనూ ఇదే తరహా వ్యూహాలను అమలు చేయాలనుకుంటోంది. వీటినిలా కొనసాగిస్తూనే చర్చలనూ కొనసాగించాలని ఆలోచిస్తోంది.

దగ్గరి నుంచి దాడి చేసే మౌంటెన్‌ ట్రూప్స్

ఎల్ఏసీ వెంబడి స్పెషల్ మౌంటెన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌‌ను మన దేశం రంగంలోకి దించింది. వెస్ట్రన్, ఈస్ట్రన్, మిడిల్ సెక్టార్ల‌లో ఎటు నుంచి పీఎల్ఏ కవ్వించినా ఈ స్పెషల్ ఫోర్స్ ఆటకట్టించనుంది. సరిహద్దులకు రక్షణ విషయంలో మన ఆర్మీ చర్యలు తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. ఏ క్షణంలోనైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కొనేందుకు వాటిని రంగంలోకి దించినట్టుతెలుస్తోంది. మౌంటెన్ ట్రూప్స్ గొరిల్లాయుద్ధవిద్యలోఆరితేరినవాళ్లు. ఎత్తైన, ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రత్యర్థులపై దాడి చేయగలరు. కార్గిల్ వార్ టైంలో ఈ ట్రూప్స్ ఎక్కువగా మన ఆర్మీకి ఉపయోగపడ్డాయి. ‘‘పర్వత ప్రాంతాల్లోయుద్ధం చాలా కష్టం. ఒక్కోగ్రూపు పది మందిని చంపినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాఖండ్, లడఖ్, గోర్ఖా, అరుణాచల్, సిక్కింలోని ట్రూప్స్ ఎన్నో ఏళ్లుగా ఈ రకమైన పోరాటంలో ఆరితేరారు. ఈ దళాలు ప్రత్యర్థులపై దగ్గర నుంచి దాడి చేయగలవు. ఆర్టిలర్టి రీ గన్స్, మిస్సైళ్లుపిన్ పాయింట్‌‌ గా దాడి చేసినా మౌంటెన్ టార్గెట్లు ఎక్కువగా మిస్ ‌‌అవుతుంటాయి. కానీ ఈ ట్రూప్స్ త‌మ‌ పోరాటంలో ముందుంటాయి”అని మాజీ ఆర్మీ చీఫ్ ఒకరు చెప్పారు.

‘గల్వాన్‌’ ఘటనలో చైనా ఆఫీసర్‌‌ మృతి

గల్వాన్‌‌లోయ గొడవలో ఓ చైనీస్‌‌కమాండర్‌‌ఆఫీసర్‌‌ మరణించినట్టు తెలిసింది. ఘటన జరిగిన వారం తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన చర్చల్లో చైనా ఆర్మీ ఈ విషయం కన్ఫమ్‌‌ చేసినట్టు సమాచారం.

మే4 నాటికి ముందు పొజిషన్ కొనసాగించాలి

లడఖ్ సెక్టార్‌‌ లోని ఎల్‌‌ఏసీ వెంబడి మే 4కి ముందున్న బార్డర్‌‌ను గౌరవించాలని చైనాను మన దేశం కోరింది. మే 4 తర్వాత ముందుకు చొచ్చుకొచ్చిన సైన్యాన్ని వెంటనే విత్‌‌డ్రా చేసుకోవాలంది. ఎల్‌‌ఏసీ వెంబడి ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్ద‌ని కూడా చైనాను కోరినట్టు తెలిసింది. సోమవారం రెండు దేశాల ఆర్మీ కమాండర్ స్థాయి అధికారుల రెండో విడత సమావేశం జరిగింది. ఈస్ట్ ల‌డ‌ఖ్ లో చుషుల్ సెక్టార్‌‌ లోని చైనా వైపున్న మోల్డోలో ఈ మీటింగ్ జరిగింది. ఎల్‌‌ఏసీ నుంచి ట్రూప్స్ ను ఉపసంహరించుకునేందుకు టైమ్ లైన్ ఇవ్వాలని కూడా డ్రాగన్ ‌‌కంట్రీని కోరింది. గల్వాన్ వ్యాలీలో ఈ నెల 15 రాత్రి జరిగిన ఘరణలో 20 మంది మన సైనికులు వీరమరణం పొందడంతో.. బార్డ‌ర్ లోని టెన్షన్లను కంట్రోల్ చేసేందుకు రెండు దేశాలు చర్చలు
మొదలుపెట్టాయి. ఈ దిశగా ఈ నెల ఆరున మొదట మిజోరంలో భూకంపం దఫా చర్చలు జరిగాయి.

ఇండో చైనా జవాన్ల ఫైటింగ్ వీడియో వైరల్

ఇండియా, చైనామధ్య టెన్షన్ల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌‌గా మారింది. ఐదున్నర నిమిషాలున్నఈ వీడియోలో చైనా బలగాలు మన భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్ల‌ను మన
సైనికులు హెచ్చరిస్తున్నా ఐదారు మంది వెనక్కి తగ్గకపోవడంతో మన వాళ్లు అటాక్ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ఐతే ఈ వీడియో ఎప్పటిదన్నది స్పష్టంగా తెలియడం లేదు. జవాన్లు మాస్క్ పెట్టుకోవడాన్ని బట్టి ఈ మధ్యే ఘర్ష‌ణ జరిగినట్లు
తెలుస్తోంది. సిక్కింలో నాకులా దగ్గర ఈ గొడవ జరిగి ఉంటుందని అనుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates