కుళ్లిపోయిన స్థితిలో ఆనంద్ రెడ్డి మృతదేహం గుర్తింపు

ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి  మృతదేహాన్ని భూపాలపల్లి రాంపూర్ అటవీ ప్రాంతంలో గుర్తించారు పోలీసులు. మూడ్రోజుల క్రితం హన్మకొండలో కిడ్నాపైన ఆనంద్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.

ఈనెల 7న హన్మకొండలో ఆనంద్ రెడ్డి  కన్పించకుండా పోవడంతో  ఆ తెల్లారి అంటే 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు తెలిపారు.

ఆ తర్వాత దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మత్య విషయం బయటపడటంతో.. వాళ్లను తీసుకుని భూపాలపల్లి అటవీప్రాంతానికి వెళ్లారు. అక్కడ అనుమానితులు చూపించిన ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. అయితే మృతదేహం కుళ్లిపోవడంతో.. రేపు ఉదయం స్పాట్ లోనే పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు పోలీసులు. ఆ తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్నారు.

Latest Updates