ప్యాసింజర్ నగలను కొట్టేసిన ఆటోడ్రైవర్

ప్యాసింజర్ నగలనే కొట్టేసి పరారయ్యాడు ఓ ఆటో డ్రైవర్. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ లో ఈ ఘటన జరిగింది.   లక్డీకపూల్ నుండి కాకతీయ నగర్​ లోని  తమ ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు ఓ కుటుంబ సభ్యులు. ఇంటికి చేరిన తర్వాత  ఆటోలో ఉన్న లగేజ్ దించేలోగానే ఆటోలో ఉన్న హాండ్ బ్యాగ్ తో పరారయ్యాడు ఆటో డ్రైవర్  ముదావత్ పెంట్య. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నేరేడ్మెట్ పోలీసులు నిందితుడు పెంట్యను అదుపులోకి తీసుకున్నారు.  అతని నుంచి 10 తులాలకు పైగా బంగారు నగలు, 9 వేల రూపాయల నగదును ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఆర్థిక పరిస్థితులు బాగలేకనే దొంగతనానికి పాల్పడ్డట్లు నిందితుడు చెప్పాడు.

Latest Updates