
సూర్య పేట ఏరియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీకి ఓ నర్సు,ఆయా కలిసి ఆపరేషన్ చేయడంతో పసికందు మృతి చెందింది. పెన్పహాడ్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు పాల్గున శ్రీలత దంపతులు మొదటి కాన్పు కోసం మంగళవారం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి వచ్చారు. అర్థరాత్రి వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో నర్సు, ఆయా ఆపరేషన్ చేశారు. కంగారులో కత్తెరతో పసికందు తలపై గాయ౦ చేశారు. రక్తం కారడంతో పసికందును అలాగే వదిలేసి వెళ్లిపోయారు. నర్సు ఆపరేషన్ చేయడంతోనే శిశువు మృతి చెందిందని బాధితురాలి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.