కోహ్లి లాంటి ప్లేయర్‌‌ను ఎప్పుడూ చూడలేదు

ఐపీఎల్ ముగియడంతో అందరి చూపు ఆస్ట్రేలియా సిరీస్ వైపు మళ్లింది. కరోనా కారణంగా కొన్ని నెలల గ్యాప్ తర్వాత టీమిండియా ఆడనున్న ఇంటర్నేషనల్ సిరీస్ ఇదే కానుంది. కీలకమైన ఈ సిరీస్‌‌కు టీమిండియా జంబో బృందాన్ని ఎంపిక చేసింది. అయితే టీ20, వన్డేలకు అందుబాటులో ఉండనున్న కెప్టెన్ విరాట్ కోహ్లి.. టెస్ట్ సిరీస్‌‌లో కేవలం ఒక్క మ్యాచ్ ఆడనుండటం కాస్త ఆందోళన కలిగించే అంశమే. కోహ్లి గైర్హాజరీలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా చేజిక్కించుకోవడం అంత సులువు కాదు. తాజాగా ఈ సిరీస్‌‌తోపాటు కోహ్లి గురించి ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. కోహ్లి లాంటి ప్లేయర్‌‌ను తాను ఎప్పుడూ చూడలేదని ప్రశంసలు కురిపించాడు.

‘నేను ఇంతకు ముందే చెప్పా. నా జీవితంలో కోహ్లి లాంటి ఆటగాడ్ని ఇప్పటివరకు చూడలేదు. నేను చూసిన ప్లేయర్స్‌‌లో కోహ్లి అత్యుత్తమం. అతడి బ్యాటింగ్‌‌తోపాటు ఎనర్జీ, గేమ్‌‌పై ఇష్టం, ఫీల్డింగ్ చేసే విధానం అన్నీ బాగుంటాయి. అతడు చేసే ప్రతి పనిలో అంత శక్తిని ఎలా చూయిస్తాడో తెలియదు. టెస్టు సిరీస్‌‌లో కోహ్లి ఆడకపోవడంపై ప్రత్యర్థి జట్టుగా మేం సంతోషంగా ఉన్నామనుకుంటున్నారా? అస్సలు కాదు. కోహ్లి లేకపోవడం టీమిండియాపై ప్రభావం చూపుతుంది. కానీ ఇండియా టీమ్ మంచి సమతూకంతో ఉంది. గత పర్యటనలో వాళ్లు మమ్మల్ని ఓడించారు’ అని లాంగర్ పేర్కొన్నాడు.

Latest Updates