అతడి వల్లే నా కెరీర్ మారింది: కోహ్లీ

న్యూఢిల్లీ:  ఏ ఆటగాడు సక్సెస్ కావాలన్నా టెక్నిక్, కళతోపాటు ఫిట్ నెస్ చాలా కీలకమని స్పోర్ట్స్ అనలిస్టులు, మాజీ క్రీడాకారులు చెప్తుంటారు. ఫిట్ నెస్ మెరుపుర్చుకుంటే గాయాలయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అలాగే కెరీర్ సుదీర్ఘ కాలం పొడిగించాలంటే ఫిట్ నెస్ చాలా కీలకం. దీనికి క్రికెటర్స్ కూడా మినహాయింపు కాదు. ఒకప్పుడు ఇండియా క్రికెట్ లో ఫిట్ నెస్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే వారు కాదు. కానీ కోహ్లీ కెప్టెన్ గా మారాక మన క్రికెట్ లో ఫిట్ నెస్ చాలా కీలకమైపోయింది. మిగతా ప్లేయర్లకు ఆదర్శంగా నిలవాలంటే ముందు కెప్టెన్ మారాల్సి ఉంటుంది. అందుకే కోహ్లీ ఎప్పుడూ  ఫిట్ గా ఉంటూ టీమ్ ప్లేయర్స్ ను కూడా ఫిట్ గా మార్చడానికి ప్రయత్నిస్తుంటాడు. మరి కోహ్లీ ఫిట్ నెస్ రహస్యం ఏంటో తెలుసా? అతడి ఫిట్ నెస్ వెనుక దాగున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుందా?

విరాట్ ఫిజికల్ గా ఇంత ఫిట్ గా మారడానికి కఠిన శ్రమ దాగి ఉంది. అలాగే అతడి ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ వెనుక ఓ కోచ్ సలహాలు, సూచనలు కూడా ఉన్నాయి. అతడే టీమిండియా మాజీ స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్ శంకర్ బసు. ఫిట్ నెస్ విషయం ఇంతగా మార్పు సాధించడానికి శంకర్ బసు ప్రధాన కారణమని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ఇండియా ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ తో జరిగిన ఓ ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్ లో కోహ్లీ ఫిట్ నెస్ తో పాటు పలు విషయాలు పంచుకున్నాడు. తీవ్రమైన కసరత్తులు చేయడంతోపాటు డైట్ కూడా ఫిట్ నెస్ ట్రాన్స్ ఫార్మేషన్ లో ముఖ్య భూమిక పోషించిందని కోహ్లీ తెలిపాడు.

కష్టపడకపోతే దూరమవడం బెటర్

‘ఫిట్ నెస్, ట్రెయినింగే నాకు సర్వస్వం. నా కెరీర్ లో 2015లో భారీ మార్పు వచ్చింది. దీనికి ప్రధాన కారణం శంకర్ బసు. దీనికి నేను క్రెడిట్ తీసుకోను. నా కెరీర్ ఈ దశలో ఉండటానికి ఆయనే కారణం. ఆర్సీబీకి బసు ట్రెయినర్ గా ఉన్నారు. ఆయనే నాకు లిఫ్టింగ్ ను ఇంట్రడ్యూస్ చేశారు. మొదట్లో నేను కొంచెం తడబడ్డా. ఆ టైమ్ లో వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడతున్నా. అది నాకు పూర్తిగా కొత్త విషయం. కానీ మూడు వారాల్లో సాధించిన ఫలితాలతో నేను ఆశ్చర్యపోయా. ఆ తర్వాత నా డైట్ మీద బసు శ్రద్ధ వహించారు. నా శరీరం ఎలా స్పందిస్తునదే దాన్ని గమనించడం మొదలుపెట్టా. జన్యు ప్రభావం వల్ల నేను రెండు లేదా మూడు సార్లు అధికంగా పని చేయాలని గుర్తించా. నా కెరీర్ కోసం చేయాల్సిన ప్రాథమిక విషయాలపై నేను పని చేస్తున్నా. స్పోర్ట్స్ ఆడే చివరి క్షణం వరకు నేనో ఉన్మాదిలానే ఉంటా. మీరు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి చాలా కష్టపడాలి. ఒకవేళ అంత కష్టపడలేకపోతే దాని నుంచి మీరు దూరంగా ఉండటమే బెటర్’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

Latest Updates