బిజెపి కులం, మతం, భాషల పేరుతో రాజకీయం చేస్తోంది

V6 Velugu Posted on Jan 26, 2022

 

  • ఈ పోలరైజేషన్  దేశ సమగ్రతకు ప్రమాదకరం
  • టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు

 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బిజెపి కులం, మతం, భాషల పేరుతో రాజకీయం చేస్తోందన్నారు. ఈ పోలరైజేషన్  దేశ సమగ్రతకు ప్రమాదకరమన్నారు. గణతంత్రం అంటే ప్రజలే పాలకులని, ఎంతో మంది మేధావులు చాలా కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. లౌకికవాదం, సమానత్వం, సమసమాజ నిర్మాణం గణతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిత్యం గణతంత్ర విలువలను కాపాడి ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగడానికి నీళ్లు అందించామని, కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు పైగా నీళ్లు అందించామన్నారు. రూపాయి కిలో బియ్యము, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి పథకాలతో దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని, బీజేపి నాయకులు అనవసరంగా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు.

ఇవి కూడా చదవండి..

బిజెపి కులం, మతం, భాషల పేరుతో రాజకీయం చేస్తోంది

 

 

Tagged Bjp, caste, Keshava Rao, TRS, religion , language, k, mission bhageeratha, rythu bandhu

Latest Videos

Subscribe Now

More News