గొంతులో ఇరుక్కున్న చికెన్ బొక్క : ఉక్కిరిబిక్కిరైన బాలుడు

హైదరాబాద్ : సండే కదా ఎం చక్కా చికెన్ తో లాగించేద్దామనుకున్న ఓ బాలుడికి చికెన్ బొక్క ప్రాణాల మీదికి తెచ్చింది. చికెన్ తో అన్నం తింటుండగా పెద్ద సైజులో ఉన్న ఎముక ప్రమాదవశాత్తు బాలుడి(10) గొంతులో ఇరుక్కు పోయింది. దీంతో ఆ బాలుడు ఉక్కిరిబిక్కి కావడంతో వెంటనే తల్లిదండ్రులు హస్పిటల్ కి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన ఆదివారం శేరిలింగంపల్లి పరధిలో జరిగింది.

లింగంపల్లికి  చెందిన ఓ బాలుడు(10)కు చికెన్‌ తింటుండగా ప్రమాదవశాత్తూ ఓ ఎముక(2 cm) అతని ఆహారనాళంలో ఇరుక్కుంది. వెంటనే అతన్ని తల్లిదండ్రులు గచ్చిబౌలిలోని ఓ హస్పిటల్ కి తీసుకువచ్చారు. దీంతో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ రఘురాం కొండల నేతృత్వంలోని డాక్టర్లు ఆ బాలుడి గొంతులో ఇరుక్కున్న ఎముకను బయటకు తీశారు. తర్వాత ఎండోస్కోపింగ్‌ క్లిప్పింగ్‌ చేశారు.

దీంతో ఆహార నాళం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని తెలిపిన డాక్టర్లు .. ఇలాంటి అత్యవసర కేసులను వెంటనే చూడాలన్నారు. ఏ మాత్రం ఆలస్యమైనా ఆహార నాళానికి రంధ్రం పడి ఇన్ఫెక్షన్‌కు దారి తీసే ప్రమాదం ఉండేదన్నారు. పలు కేసులో మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు డాక్టర్‌ రఘురాం. చిన్న పిల్లలకు చేపల కూర, చికెన్ బోన్స్ తినిపించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు డాక్లర్లు. చికెన్, మటన్ తినిపించేటప్పుడు ఎముకలను తీసేసి పిల్లలకు పెట్టాలన్నారు.

See Also : శబరిమలకు మహిళల ఎంట్రీపై మరోసారి సుప్రీంలో విచారణ

Latest Updates