సాయం కోసం సమీర్ ఎదురుచూపులు

విద్యుత్ ​ప్రమాదంలో చేతులు కోల్పోయిన బాలుడు.. ఆదుకోవాలని వినతి
రెండు చేతులు కోల్పోయి దివ్యాంగుడైన సమీర్

పరిగి, వెలుగు: ఈనెల 8న జరిగిన విద్యుత్​ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా మరో బాలుడు రెండు చేతులు కోల్పోయి దివ్యాంగుడిగా మారాడు. నిరుపేద కుటంబానికి చెందిన మహ్మద్​ రఫీ, -రేష్మ దంపతులది పరిగి మండలం మాదారం. రఫీ పరిగిలో ఫ్రూట్స్​విక్రయిస్తుంటాడు. వీరికి నలుగురు సంతానం. సమీర్​8న గాలిపటం ఎరగేస్తుండగా అది విద్యుత్​వైర్లకు తగిలింది. దానిని తీస్తుండగా విద్యుదాఘాతానికి గురవడంతో సమీర్​ రెండు చేతులు కోల్పోయాడు.

రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబం కావడంతో బాలుడికి వైద్యం చేయించలేకపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న శంకర్​పల్లి మండలం బానూర్​కు చెందిన చి విన్నర్స్​ఫౌండేషన్ సభ్యులు రూ.18 వేల విలువ చేసే సరుకులు అందజేశారు. బాలుడి విద్య, వైద్యపరంగా ఆదుకుంటామని ఫౌండేషన్​ అధ్యక్షుడు అరికపూడు రఘు, జీవరత్నం, మల్లేష్, ప్రభులింగం తెలిపారు.

Latest Updates