చేతబడి చేశాడన్న నెపంతో యువకుడి దారుణ హత్య

మేడ్చల్ జిల్లా శామీర్ పేట అద్రాస్ పల్లిలో దారుణం జరిగింది. చేతబడి చేశాడన్న కారణంతో యువకుడిని దారుణంగా హత్య చేశారు. లక్ష్మి అనే మహిళ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో చనిపోయింది. అయితే  చేతబడి చేయటంతో లక్ష్మీ చనిపోయిందని… బంధువులు దారుణానికి పాల్పడ్డారు. ఆంజయేయులపై ముందు నుంచి అనుమానం వ్యక్తం చేసిన లక్ష్మీ కుటుంబ సభ్యులు….అతన్ని  కర్రలతో తీవ్రంగా కొట్టి మహిళ చితిమంటల్లోనే వేసి సజీవ దహనం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు… ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates