సీఎం కేసీఆర్ మేన‌ల్లుడి నుంచి ప్రాణహాని ఉంది

హైద‌రాబాద్: సీఎం కేసీఆర్ మేనల్లుడైన విజ‌య భాస్క‌ర్ అనే వ్య‌క్తి బ‌ల‌వంతంగా త‌మ ఆస్తి అత‌ని పేరు మీద రాయించుకున్నారంటూ ఓ వ్యాపార‌వేత్త దంపతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నగ‌రానికి చెందిన ‌పాబంది ప్రభాకర్ దంపతులు ఆదివారం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… ఓ బిల్డర్ తో కలిసి విజ‌య భాస్క‌ర్.. రూ.23 కోట్ల విలువైన‌ ఆస్తిని బలవంతంగా తమ పేరుమీద రాయించుకున్నాడ‌ని తెలిపారు. సైబరాబాద్ పోలీసులు… ఆ ఆస్తికి సంబంధించిన‌ సివిల్ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలంటూ తన పై పలు పోలీస్ స్టేషన్ లలో అక్రమ కేసులు పెట్టారని ప్రభాకర్ ఆరోపించారు. సెటిల్మెంట్ కు ఒప్పుకోనందుకు…త‌న‌పై అక్రమంగా కేసులు పెట్టి 45 రోజులు జైలుకు పంపించారని అన్నారు. తనకు , తన కుటుంబానికి పోలీసుల నుండి , కేసీఆర్ మేనల్లుడు విజయ్ భాస్కర్ రావు నుండి ప్రాణహాని ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

The businessman couple alleged that life-threatening condition from CM KCR's nephew

Latest Updates