ఆదివారం 6గంటలకు ప్రచారం ముగించాలి

హైదరాబాద్‌ః గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6గంటలకు ముగించాలని తెలిపింది రాష్ట్ర ఎన్నికల కమిషన్.‌గ్రేటర్‌ పరిధిలో ఎన్నికలుజరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటించని రాజకీపార్టీల నాయకులు, అభ్యర్ధుల, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం. అశోక్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జీహెచ్‌ఎంసి యాక్ట్‌, 1955 ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విఽధించే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే 48గంటల్లో ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు, అభ్యర్ధులు ఎన్నికల కమిషన్‌ విధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

Latest Updates