కార్టూన్ టీచర్

‘హలో, నాన్ దన్ మిసెస్ జానకీ. కేఆర్‌ఎస్‌ఎన్‌‌‌‌‌‌‌‌ఎమ్‌ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లా టీచర్ ఆహ్ ఇరుకెన్…’ అంటూ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ముచ్చట్లు చెప్తోంది ఓ తమిళ టీచర్‌. కొన్ని వారాలుగా, ఈ టీచర్‌ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొప్పును చక్కగా ముడి వేసుకుని, చుడిదార్‌ కట్టుకుని కెమెరా ముందుకు వస్తుంది. ఆమె మాటల్లోని వ్యంగ్యం, కంఠంలోని కఠినత్వం.. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇవన్నీ చూసి, ఆమె ఎవరా? అని గూగుల్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ ప్రయత్నం మానుకోండి ఆమె నిజం కాదు.

మిసెస్‌ జానకీని చూసిన చాలామంది.. అలాంటి క్యారెక్టర్‌ అభిషేక్‌ లైఫ్‌లో ఉందేమో అనుకున్నారు. వాళ్లస్కూల్‌ టీచర్‌నే ఆయన ఇమిటేట్‌ చేస్తున్నాడు అని ఇంకొందరు అనుకున్నారు. కొందరు ‘ఈమె ఏ స్కూల్​లో పని చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు’ అని కామెంట్లు పెడుతున్నారు. నిజానికి అలాంటి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అభిషేక్‌ ఎప్పుడూ చూడలేదు. పైగా ఆయన చదువు చెప్పిన టీచర్లలో కూడా ఇలాంటివాళ్లు లేరు. అప్పుటికప్పుడు అనుకుని క్రియేట్‌ చేసిన క్యారెక్టర్‌ అది.

 

మిసెస్‌‌ జానకీ క్యారెక్టర్ నిజం కాదు. కెఆర్ఎస్ఎమ్ స్కూల్ కూడా లేదు. స్టాండప్ కమెడియన్ అభిషేక్‌‌ కుమార్ ఆ క్యారెక్టర్ ని సృష్టించాడు. అదొక యానిమోజీ వీడియో. దాన్నిఆయన ఐఫోన్‌‌తో రూపొందించాడు. ‘నేను మ్యూజిక్ కవర్ల కోసం యానిమోజీ ఫీచర్‌ వాడతాను. ఒకసారి నా కజిన్‌ ఫోన్ చేసి బోర్డు ఎగ్జామ్స్‌‌ రద్దు చేశారని చెప్పింది. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ విషయంపై ఒక స్కూల్‌ ‌టీచర్‌‌లా మాట్లాడాలనుకున్నా. మా అమ్మ చుడీదార్‌ వేసుకుని వీడియో చేశా. స్క్రిప్ట్ రాయకుండా, ప్రాక్టీస్ చేయకుండానే ఆన్ ది స్పాట్ మాట్లాడాను. కానీ.. ఇంతలా  వైరల్‌ ‌అవుతుందని ఊహించలేదు’ అంటున్నాడు అభిషేక్‌‌. ఒక్క రోజులోనే లక్ష వ్యూస్‌

ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్‌ చేసిన ఒక్క రోజులోనే లక్షకు పైగా వ్యూస్‌‌ వచ్చాయి. ఇప్పుడు మిలియన్‌‌కుపైగా వ్యూస్‌‌ సాధించింది. మూడు గంటల్లోనే పదకొండు వేలమంది షేర్‌ చేశారు. ఆ ఒక్క వీడియో ద్వారానే అతనికి 15,000 మంది ఫాలోవర్స్ ‌పెరిగారు. ఆ వీడియోలో మిసెస్‌ జానకీ బోర్డు పరీక్షలు, మ్యాథ్స్‌‌ క్లాసెస్‌ ‌గురించి మాట్లాడింది. అభిషేక్‌‌ స్టాండప్‌ కమెడియన్‌గా ఉన్నప్పుడు ఎన్నో ప్రయోగాలు చేశాడు. కానీ.. పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఆయన వీడియోలు వైరల్‌‌ అవుతున్నాయి. ఇంజనీరింగ్ చేసిన ఆయన యాక్సిడెంటల్‌‌గా కమెడియన్ అయ్యాడు. గతంలోనాటకాలను దర్శకత్వం చేసేవాడు. తర్వాత ప్రొఫెషనల్ థియేటర్ ఆర్టిస్ట్‌ గా మారిపోయాడు.

ఎంజాయ్‌ చేస్తున్నారు

‘నేను కాలేజీలో ఒక డ్రామా క్లబ్‌లో ఉన్నప్పుడు ఎన్నో నాటకాలకు డైరెక్షన్‌ చేశా. తర్వాత యాక్టింగ్ ఫీల్డ్ ‌లోకి వచ్చా. ఈ విషయం చెప్పినప్పుడు ఇంట్లో ఒప్పుకోలేదు. నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మంచి ఉద్యోగం సంపాదించి సెటిల్‌‌ అవ్వమని చెప్పారు. నేను వినకుండా ఈరంగంలోనే  ఉన్నా. కానీ.. మాఇంట్లో వాళ్లు ఒకసారి నా యాక్టింగ్ చూసి, చాలా మెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ల నిర్ణయం మార్చుకుని ఎంకరేజ్‌ ‌చేస్తున్నారు. నా వీడియోలు చూసే వాళ్లలో ఎక్కువ మంది పిల్లలు, టీచర్లే ఉన్నారు. అందుకే మాటలు, యాక్టింగ్ ఎక్కడా అసభ్యంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా…  దానివల్లే నా వీడియోలను బాగా ఎంజాయ్‌ ‌చేస్తున్నారు. పైగా కొంత మంది పిల్లలు మిసెస్ జానకీకి రిప్లైగా వాళ్ల వెరన్ష్లను పంపారు’ అని చెప్పాడు అభిషేక్‌‌. మిసెస్‌ ‌జానకీ వీడియోలను చూసిన ఒక హెడ్‌ ‌మాస్టర్‌ అభిషేక్‌‌కి కాల్‌ చేసింది . ఆమె ఎక్కడ తిడుతుందోనని భయపడ్డాడు అభిషేక్‌‌. కానీ.. ఆమె కంగ్రాట్స్‌ ‌చెప్పి  ఎంకరేజ్‌ ‌చేసింది. ఇలా ఆ తర్వాత ఎన్నో కాల్స్ ‌వచ్చాయి. అభిషేక్ తన వీడియోల్లో సూర్య గ్రహణం, చైనా వస్తువుల బ్యాన్‌‌, ఆన్‌‌లైన్ క్లాసెస్‌‌.. లాంటి అంశాలు ఉంటాయి.

 

Latest Updates