ఐపీఎల్‌ కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్–13వ ఎడిషన్​ను యూఏఈకి తరలించేందుకు లైన్​ క్లియర్​ అయ్యింది. ఇండియన్​ గవర్నమెంట్‌ .. బీసీసీఐకి రాతపూర్వకంగా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చేసింది. లీగ్‌ ను యూఏఈలో నిర్వహించేందుకు కేంద్రం నుంచి తమకు అధికారికంగా పర్మిషన్‌ లభించిందని ఐపీఎల్ చైర్మన్​ బ్రిజేష్​ పటేల్ సోమవారం తెలిపారు. కేంద్ర హోమ్‌, విదేశాంగ శాఖల నుంచి ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లు వచ్చాయని చెప్పారు. యూఏఈ గవర్నమెంట్‌ నుంచి కూడా రాతపూర్వక పర్మి షన్స్‌‌ కోసం వేచి చూస్తున్నామన్నారు. మరికొద్ది రోజుల్లో అవి కూడా అందుతాయని బ్రిజేష్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest Updates