లోకల్​, ఫారిన్​ ప్రొడక్ట్​లకు కలర్ కోడ్!

​​న్యూఢిల్లీ: చైనా ప్రొడక్ట్​లకు చెక్​ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లోకల్​, ఫారిన్​ వస్తువులకు సెపరేట్​ కలర్​కోడ్​ను అమలు చేయాలని భావిస్తోంది. వెజిటేరియన్​ ఫుడ్​కు గ్రీన్​, నాన్​ వెజిటేరియన్​ ఫుడ్​కు రెడ్​ కలర్​ను వాడుతున్నట్టుగానే వీటికి ప్రత్యేకమైన రంగులను వినియోగించే దిశగా చర్యలు తీసుకుంటోంది. మేడిన్​ ఇండియా గూడ్స్​కు ఆరెంజ్​ లేదా కాషాయం రంగులను అమలు చేసే అవకాశం ఉంది. చాలా మంది కస్టమర్లు సోర్స్​ ఆఫ్​ ది ప్రొడక్ట్​ గురించి తెలుసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, కలర్​ కోడ్​ విషయంపై ప్రభుత్వంలో చర్చ జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈ గైడ్​ లైన్స్​కు మరింత మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాయి. అలాగే తమ ప్లాట్​ఫాంపై అమ్మే వస్తువుల సోర్స్​ను వెల్లడించాలంటూ ఈ కామర్స్​ సంస్థలకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. లోకల్​గా వాల్యూ ఎడిషన్లు చేసినట్లయితే వాటి వివరాలను జత చేయాలని సూచించింది. గవర్నమెంట్​ ఈమార్కెట్​ప్లేస్​(జీఈఎం) ఈ వివరాలను వెల్లడించడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

ఆత్మనిర్భర్​ భారత్​లో భాగంగా..

‘‘ఆత్మ నిర్భర్​ భారత్​లో భాగంగా జీఈఎం పలు కీలక చర్యలు తీసుకుంది. జీఈఎంలో రిజిస్టరింగ్​ చేసుకునే టైంలో అన్ని ప్రొడక్ట్​లకు సంబంధించిన కంట్రీ ఆఫ్​ ఆరిజన్​ను సెల్లర్స్​కు మ్యాండేటరీ చేసింది. ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాకముందే తమ ప్రొడక్ట్​లను అప్​లోడ్​ చేసిన సెల్లర్లు కూడా వాటి ఆరిజన్​ను రెగ్యులర్​గా అప్​డేట్​ చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఈ విషయంలో ఆ సంస్థలు ఫెయిల్​ అయితే వాటి ప్రొడక్ట్​లను జీఈఎం నుంచి తొలగిస్తాం”అని జీఈఎం ఒక ప్రకటనలో పేర్కొంది. రాబోయే రోజుల్లో అమెజాన్, ఫ్లిఫ్​కార్ట్​, పేటీఎం మాల్​ వంటి ఈ–టెల్లర్స్​ వంటి సంస్థలు కూడా ఈ డిస్​క్లోజుర్​ నిబంధనలను ఫాలో కావాలని స్పష్టం చేసింది. ప్రతిపాదిత ఈ కామర్స్​ పాలసీలో కూడా గతంలో ఇవే ప్రపోజల్స్​ను అమలు చేశారు. తక్కువ రేటు కలిగిన వస్తువులను అమ్మేందుకు ఈ సంస్థలు చైనా కంపెనీలపై ఆధారపడుతున్నాయని, లోకల్​ వస్తువులకు ప్రోత్సాహం కల్పించేందుకు, వాటికి మార్కెట్​ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ అధికారి తెలిపారు.

ఇప్పుటికిప్పుడు అమలు కష్టం

ఆన్​లైన్​ కంపెనీల ఎగ్జిక్యుటివ్స్​ మాత్రం ప్రస్తుతం ఆన్​లైన్​లో పెట్టిన కోట్లాది వస్తువులకు దీనిని వర్తింప చేయడం తమకు కుదరని పని అని చెబుతున్నారు. అలాగే వాల్యూ ఎడిషన్​ గురించి డిస్​క్లోజ్​ చేసే అవసరం రాబోదని అంటున్నారు. ‘‘మీరు ఓ టీవీ సెట్​ లేదా మొబైల్​ ఫోన్​ను కొంటే.. అందులోని వస్తువులు ఫారిన్​ నుంచి ఇంపోర్ట్​ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఇక్కడ అసెంబిల్డ్​ చేస్తే మేడిన్​ ఇండియా స్టిక్కర్​ ఉంటుంది. అలాంటప్పుడు వాల్యూ ఎడిషన్​ గురించి మనం ఎలా ప్రస్తావించగలం”అని ఓ ఎగ్జిక్యూటివ్​ ప్రశ్నించారు.
.
.

Latest Updates