ప్ర‌భుత్వ బ్యాంక్ ల‌లో కేంద్రం వాటా త‌గ్గాలి

ప్ర‌ధానిని కోరిన ఆర్ బీఐ
బ్యాంక్ హెడ్ ల పదవీ కాలాన్ని పెంచాలి
జీతాలు కూడా ప్రైవేట్ స్థాయిలో ఉండాలి
ఫైనాన్షియ‌ల్ రెగ్యులేటర్స్ తో మోడీ భేటీ

ప్ర‌భుత్వ‌ రంగ బ్యాంక్ కు కేంద్రం తమ వాటాను 26 శాతానికి తగ్గించుకోవాలని రిజర్వ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) కోరింది. అంతేకాక పొరఫెషినల్ మేనేజ్ మెంట్ కోసం బ్యాంక్ హెడ్ లను ఎక్కువ‌కాలం పదవిలో ఉండేలా చూడాలని తెలిపింది. ప్ర‌ధాన మంత్రి నరేంద్ర‌ మోడీతో జరిగిన మీటింగ్ లో ఆర్ బీఐ ఈ విషయాలను వినిపించింది. ఫైనాన్షియ‌ల్ రెగ్యులేటర్స్ హెడ్ లతో ప్ర‌ధాని మోడీ సమావేశమయాయ్రు. కరోనా వైరస్ నుంచి ఎకానమీని పట్టాలెక్కించే చర్య‌లపై వారితో చర్చ‌లు జరిపారు. ఎకానమీ కోసం రెగ్యులేటర్స్ ముఖ్యంగా ఆర్ బీఐ తీసుకునే పలు చర్య‌ల‌పై చర్చించిన‌ట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మూడు గంటల పాటు జరిగిన ఈ మీటింగ్ కు ఆర్ బీఐ గవర్న‌ర్ శక్తికాంత్ దాస్, సెబీ ఛైర్మైన్ అజయ్ త్యాగి, ఐఆర్ డీ ఏఐ ఛైర్మైన్ ఎస్ సీ ఖుంటియా, పీఎఫ్ ఆర్ డీఏ ఛైర్మైన్ సుప్ర‌తిం బంద్యో పాధాయ్య పాల్గాన్నారు. ప్ర‌ధానితో పాటు ఆర్ధిక‌ మంత్రి నిర్మ‌ల‌ సీతారామన్ కూడా ఈ మీటింగ్ కు హాజర‌య్యారు. ప్ర‌భుత్వ‌ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ల పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి ఐదేళకు పెంచాలని, వారి జీతాలు కూడా ప్రైవేట్ రంగ స్థాయికి తగ్గ‌ట్టుగా ఉండాలని ఆర్ బీఐ గవర్న‌ర్ ఈ మీటింగ్ లో కోరారు. అదే విధంగా ప్ర‌భుత్వ‌ రంగ బ్యాంకుల్లో 50 శాతానికి పైగా ఉన్న ప్ర‌భుత్వ‌ వాటాను 26 శాతానికి తగ్గించుకోవాలని చెప్పారు.

ప్ర‌స్తుత ఆర్ధిక‌ సంవత్స‌రంలో ఇండియా ఎకానమీ 4.5 శాతానికి పడిపోనుందని ఇంటర్నేష‌న‌ల్ మానిటరీ ఫండ్ తన తాజా అంచనాల్లో పేర్కొంది. ఆర్థిక స్థిర‌త్వానికి, గ్రోత్ పెంచడం కోసం ఫిబ్ర‌వ‌రి నుంచి ఆర్ బీఐ పలు చర్య‌లు తీసుకుంటూ వస్తోంది. వడ్డీ రేట్ల‌ను తగ్గించడం, లిక్విడిటీ ఇన్ ఫ్యూజ్ చేయడం వంటి పలు చర్య‌ల‌ను ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రూ.20.97 లక్ష‌ల‌ కోట్ల‌ ఎకనమిక్ ప్యాకేజీలో 40 శాతం ఆర్ బీఐ ప్ర‌క‌టించిన లిక్విడిటీ చర్య‌లే ఉన్నాయి. ఈ వారం మొదట్లో కూడా ప్ర‌ధాని మోడీ, ప్ర‌భుత్వ‌ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సీఈవోలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల హెడ్ లతో సమావేశమయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates