యువతిని మోసం చేసిన ట్రైనీ ఐపీఎస్ సస్పెండ్

ట్రైనింగ్‌లో ఉన్న ఓ  ఐపీఎస్ పై  కేంద్ర హోంశాఖ సస్పెన్షన్ వేటేసింది. సదరు వ్యక్తి రెడ్డి తనను మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంతో, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ట్రైనింగ్ నుంచి ఆ వ్యక్తిని సస్పెండ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వర్ రెడ్డీ తానూ ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, అయితే ఐపీఎస్‌కి ఎంపికైన తర్వాత తనను వదిలించుకునేందుకు బెదిరింపులకు దిగాడని భావన అనే యువతి గతంలో పోలీసులను ఆశ్రయించింది. విడాకులు ఇవ్వాలంటూ బెదిరించడమే కాకుండా అధిక కట్నం కోసం మరో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ ఫిర్యాదు చేసింది. ఏడాదిన్నర క్రితమే తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, కీసర రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నట్లు ఉన్న ఆధారాలతో.. మహేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని గతంలోనే  పోలీసులకి కంప్లయింట్ ఇచ్చింది.

ఆమె ఫిర్యాదు మేరకు ఐపీఎస్‌ ట్రైనింగ్‌లో ఉన్న మహేశ్వర్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సస్పెన్షన్ వేటేసింది. ఈ కేసుపై తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ట్రైనింగ్ నుంచి మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వులతో నేషనల్ పోలీస్ అకాడమీ(NPA).. అతని అపాయింట్ మెంట్ లెటర్ ని రద్దు చేసింది.

ఐపీఎస్‌కి సెలక్ట్ అయ్యాక మహేశ్వర్ రెడ్డి  తనను మోసం చేసి, వేరే పెళ్లికి సిద్దమవుతున్నాడని భావన గతంలో కంప్లయింట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. ఐపీఎస్ కు ఎంపికైన తర్వాత ఎక్కువ కట్నం వస్తుందన్న కారణంతో తనను విడాకులు ఇవ్వాలంటూ బెదిరించాడని ఆమె మీడియాకి తెలిపింది. దీంతో ఆ రోజు సాయంత్రమే కమీషనర్ ఆమె ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తూ.. మహేశ్వర్ రెడ్డిపై  FIR నమోదు చేశారు.

The Central Home Ministry suspended an IPS who is in training

Latest Updates