క‌రోనా ట్రీట్మెంట్ పై కేంద్రం దృష్టి..రూ.890కోట్ల నిధులు విడుద‌ల‌

క‌రోనా వైర‌స్ టెస్ట్ ల మౌలిక స‌దుపాయాల్ని బ‌లోపేతం చేసేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం కృషి చేస్తుంది.ఇందులో భాగంగా 22 రాష్ట్రాలు మ‌రియు కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు రూ.890 కోట్ల నిధుల్ని విడుద‌ల చేసింది. క‌రోనా కేసుల ఆధారంగా ఆయా రాష్ట్రాల‌కు ఆర్ధిక సాయం అందిస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది.

క‌రోనా వైర‌స్ విప‌త్తునుంచి ప్ర‌జ‌ల్ని కాపాడేందుకు మార్చిలోనే కేంద్ర ప్ర‌భుత్వం తొలివిడుత కింద‌ రూ.15  వేల కోట్ల అత్య‌వ‌స‌ర నిధిని కేటాయించింది.రెండో విడుత‌ల విడుద‌లైన రూ.890 కోట్ల నిధుల‌ను క‌రోనా టెస్ట్ ల‌కోసం ఉప‌యోగించే మిష‌న‌రీ కొనుగోలు కోసం కేటాయించింది.

ఆర్టీ – పీసీఆర్ యంత్రాలు, ఆర్ ఎన్ ఏ ఎక్స్ ట్రాక్ష‌న్ కిట్స్, క‌రోనా ర్యాపిడ్ హెల్త్ కిట్స్, క‌రోనా రోగుల‌కు నాణ్య‌మైన చికిత్స‌ను అందించడం ఐసీయూ బెడ్స్ , ఆక్సిజన్ జనరేటర్లు,క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు మరియు మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ల కొనుగోలుకోసం ఈ నిధుల్ని కేటాయించిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అంతేకాదు కరోనా విప‌త్తునుంచి ప్ర‌జ‌ల్ని కాపాడేందుకు విధులు నిర్వ‌హిస్తున్న డాక్ట‌ర్లు, సిబ్బందికి శిక్ష‌ణ‌, ప్రోత్స‌హాకాల్ని అందించేందుకు ఈ నిధుల్ని ఉప‌యోగించేందుకు విడుద‌ల చేసిన‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది.

Latest Updates