ప్రపంచ వ్యాప్తంగా కరోనా తెచ్చిన మార్పులు..

కోవిడ్ ఈ ఆరు నెలల్లో ప్రపంచం మొత్తం మీద తన మార్క్ వేసిన వైరస్. ఈ వైరస్ దాడి వల్ల ప్రతీ దేశం ఎంతో కొంత ప్రభావానికి లోనైంది. మన దేశంలోనూ ఫ్యామిలీ లైఫ్ మీద దీని ప్రభావం పడింది. ఈ విషయాలమీద ‘ఫెమినా’ మన దేశంలో కుటుంబాల మీదా, హౌస్ వైఫ్స్ మీదా ‘ఆల్ ఎబౌట్ ఎ విమెన్’ అని ఒక సర్వే చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే…

కరోనా, లాక్ డౌన్ తర్వాత ఓటీటీ, సోషల్ మీడియా వాడకం ఇంతకుముందు కంటే చాలాపెరిగింది. హెల్త్, ఇమ్యూనిటీ బూస్టింగ్ మీద చాలా శ్రద్ద పెరిగిపోయింది.

లాక్ డౌన్ వల్ల ఫైనాన్షియల్ గా సమస్యలు, ఇంకో పక్క మానసిక సమస్యలూ చుట్టుముట్టాయి. అయితే ఒకరకంగా ఫ్యామిలీ రిలేషన్స్ బలపడటానికి లాక్‌‌డౌన్ కూడా ఒక కారణం అయ్యింది.

కరోనా ముందు వంట విషయానికొస్తే..   39% నాన్-మెట్రో సిటీల్లో ఉండే హోం మేకర్స్ వంట చెయ్యడాన్ని చాలా ఒత్తిడిగా ఫీలయ్యేవాళ్లు.

కరోనా ముందు మెట్రో సిటీల్లో 41% మంది వంటపనిని ఒక భారంగానే చూసేవాళ్లు.

33% భర్తలకైతే అసలు వంట గురించి ఏమీ తెలిసేది కాదు. అయితే లాక్‌‌డౌన్ టైంలో ఈ లెక్కలు మారిపోయాయి.

అయితే లాక్‌‌డౌన్ తర్వాత మాత్రం 51% మంది మగవాళ్లు వంటలో ప్రయోగాలు చేస్తుండగా… 41% మంది ఆన్‌‌లైన్ వంటల వీడియోలు చూస్తున్నారట.

60% మెట్రో సిటీస్ ఫ్యామిలీలు మాత్రం ఇమ్యూనిటీ పెంచే ప్యాకేజ్డ్ ఫుడ్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

38% హౌస్ వైవ్స్ మానసిక ఆరోగ్యం మీద లాక్ డౌన్ ప్రభావం పడిందట.

72% మంది మాత్రం తమ పార్ట్‌‌నర్స్‌‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌‌తో రిలేషన్ మరింత బలంగా తయారైందంటున్నారని ఈ సర్వే చెప్తోంది.

Latest Updates