కరోనా భయంతో డోర్ లాక్ చేసుకున్న చైనా వ్యక్తి

గ్రేటర్ నోయిడాలో ఓ చైనీస్ వ్యక్తి తన ఫ్లాట్ లో డోర్ లాక్ చేసుకోవడం స్థానికులను టెన్షన్ పెట్టింది. గౌతమ్ బుద్ధ నగర్ లో చైనా దేశస్తులు కొన్నాళ్లుగా ఉంటున్నారు. అందులో ఓ వ్యక్తి భయంతో నిన్న సాయంత్రం నుంచి తనను తాను ఫ్లాట్ లో బంధించుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు చెప్పారు.

స్పెషల్ డాక్టర్ల టీమ్ అర్దరాత్రి ఫ్లాట్ కు చేరుకుంది. ఆ వ్యక్తికి టెస్టులు చేసింది. ఐతే.. టెస్టుల్లో కరోనా నెగెటివ్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. జలుబు, దగ్గు ఉంటే అనవసరంగా టెన్షన్ పడొద్దని.. డాక్టర్లు చెబుతున్నారు.

see also: వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు

Latest Updates