సీఎం చెప్పినా కదలని విద్యా శాఖ

హైదరాబాద్, వెలుగు: సర్కారు విద్యాసంస్థల బలోపేతం, ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ సిస్టంలో రిఫామ్స్‌‌‌‌‌‌‌‌పై వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌ నిర్వహించాలని సీఎం చెప్పినా విద్యాశాఖ, హయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌పై జులైలో నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించినా.. అవి నేటికీ అమలు కాలేదు. కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ కాలేజీలకు చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టాలని, సర్కారు బడులు, కాలేజీలను బలోపేతం చేయాలనే ఆలోచనతో సర్కారు ఉందని, అందుకు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌ నిర్వహించి ప్రణాళికలు రూపొందించాలని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులకు సూచించారు. సీఎం సమీక్ష పూర్తయ్యి ఐదు నెలలు పూర్తయినా ఇప్పటికీ ఆ సమావేశం నిర్వహించలేదు. అటు హయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌, విద్యాశాఖ అధికారుల్లో గానీ ఇప్పటికీ సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేంద్రం న్యూ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ పాలసీ తీసుకొచ్చినా.. దానిపై ఇప్పటివరకు చర్చ జరగలేదు. వర్చువల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌ కండక్ట్‌‌‌‌‌‌‌‌ చేసినా ఉపయోగం ఉండదనీ, కరోనా తీవ్రత కొంత తగ్గిన తరువాత మీటింగ్‌‌‌‌‌‌‌‌ పెడతామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Latest Updates