నీట్‌‌‌‌పై సుప్రీంకు..సోనియాతో భేటీలో ఏడు రాష్ట్రాల సీఎంల నిర్ణయం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నా నీట్, జేఈఈ ఎగ్జాంలను నిర్వహించడాన్ని ఏడు రాష్ట్రాలకు చెందిన సీఎంలు తీవ్రంగా వ్యతిరేకించారు. బుధవారం కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ మీటింగ్ లో వారు మాట్లాడారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్), జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ ఎగ్జాంలను వాయిదా వేసేలా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కలిసికట్టుగా పోరాడాలని నిర్ణ‌యించారు. రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం, ఇతర విషయాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్న పంజాబ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, పుదుచ్చేరి సీఎంలతో పాటు వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్ సీఎంలు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.

స్టూడెంట్లపై కేంద్రం నిర్లక్ష్యం: సోనియా

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి కేంద్రం చేసిన ప్రకటనలు సెక్యులరిజం, సైంటిఫిక్ విలువలకు వ్యతిరేకమని మీటింగ్లో సోనియాగాంధీ అన్నారు. ఈ పాలసీ ప్రభుత్వ తెలివిలేనితనాన్ని బయటపెట్టిందని, దీనిపై అపొజిషన్ విచారం వ్యక్తం చేస్తోందని తెలిపారు. స్టూడెంట్ల సమస్యలు, ఎగ్జాంలపై కూడా కేంద్రం నిర్ల‌క్ష్యంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రస్తుత ఫైనాన్షియ‌ల్ ఇయర్ కు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కచ్చితంగా 14% జీఎస్టీ పరిహారాన్ని ఇచ్చే పరిస్థితిలోలేదని స్టాండింగ్ కమిటీ మీటింగ్లో ఫైనాన్స్ సెక్రటరీ చెప్పారని, ఇది మోడీ సర్కారు చేసిన మోసమన్నారు. అపోజిషన్ పార్లు టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు తమ హక్కుల కోసం కలిసికట్టుగా కేంద్రంపై పోరాడాలన్న మమతా బెనర్జీ ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయాలను సోనియా సమర్థించారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ అసెట్ స్మెంట్(ఈఐఏ)డ్రాఫ్ట్ లెజిస్లేషన్ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని, పర్యావరణాన్ని పరిరక్షించే చట్టాలు, పబ్లిక్ హెల్త్ ను మోడీ సర్కారు బలహీనపరుస్తోందని చెప్పారు.

సుప్రీంకోర్టుకు వెళదాం: మమత

‘‘నీట్, జేఈఈ ఎగ్జామ్స్ సెప్టెంబర్లో జరగనున్నాయి. స్టూడెంట్ల జీవితాలను రిస్క్ లో ఎందుకు పెట్టాలి? దీనిపై మనం ప్రధాని మోడీకి లెటర్లు రాశాం. కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ విషయంలో మనమంతా కలిసికట్టుగా సుప్రీంకోర్టును ఆశ్రయిం
చాలి’’ అని మమతా బెనర్జీఅన్నారు. స్టూడెంట్లు ఎగ్జామ్స్ రాసేందుకు మంచి పరిస్థితులు వచ్చేవరకూ ఎగ్జామ్స్ వాయిదా వేసేలా రాష్ట్రాలన్నీకలిసి సుప్రీంకోర్టుకు వెళదామని ఆమె పిలుపునిచ్చారు.

ఆర్థిక పరిస్థితి దిగజారింది: అమరీందర్ సింగ్

‘‘కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. మనం దాదాపు రూ.500 కోట్లు ఖర్చుచేశాం. ప్రస్తుతం మన రాష్ట్రాల ఆర్థిక స్థితి అంతా దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నాం. కరోనా వల్ల పంజాబ్ ఈ ఏడాది రూ. 25 వేల కోట్లలోటును ఎదుర్కోవచ్చు. కేంద్రం జీఎస్టీ
పరిహారం ఇవ్వలేదు. మనమంతా కలిసి ప్రధాని మోడీకి రాష్ట్రాల రెవెన్యూ పరిస్థితిని తెలియజేయాలన్న మమతా జీ మాటలకు మద్దతు తెలుపుతున్నా’’ అని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు.

స్టూడెంట్లపై కేంద్రానిదే బాధ్యత..

కేంద్ర ప్రభుత్వం గత 4 నెలలుగా రాష్ట్రా లకు జీఎస్టీ పరిహారం చెల్లించలేదని చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ చెప్పారు. ఫెడరల్ విధానాన్ని కేంద్రం బలహీనంచేస్తోందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆరోపించారు. నీట్, జేఈఈ ఎగ్జాంలను నిర్వహిస్తే కరోనా కేసులు మరింతగా పెరుగుతాయని పుదుచ్చేరి సీఎం నారాయణసామి ఆందోళన వ్యక్తంచేశారు. ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్లు కరోనా బారిన పడితే కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

 

Latest Updates