బడ్జెట్ లో ఎక్కువ..నిర్మాణంలో తక్కువ

సెకండ్​ టర్మ్..డబుల్​ స్లో
రెండేండ్లుగా నత్తనడకన ఇండ్ల నిర్మాణం
2018-19లో 12 వేల ఇండ్లే పూర్తి
ప్రస్తుత ఏడాదిలో 39 వేలు కంప్లీట్
వచ్చే ఏడాది 3.44 లక్షల టార్గెట్

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్​ రెండోసారి పవర్​లోకి వచ్చిన తర్వాత కూడా డబుల్​ బెడ్​రూం ఇండ్ల నిర్మాణం స్లోగానే సాగుతోంది. బడ్జెట్​లో టార్గెట్​ ఎక్కువగా ఉంటున్నా.. పూర్తి చేసే ఇండ్ల సంఖ్య మాత్రం చాలా తక్కువే ఉంటోంది. రెండేండ్లుగా ఇదే పరిస్థితి ఉంది. 2018 నుంచి డబుల్​ ఇండ్ల నిర్మాణంలో పెద్దగా పురోగతి కనిపించడంలేదు. రాష్ట్ర సర్కార్​ మాత్రం తాజా బడ్జెట్​లోనూ భారీ టార్గెట్​ను ప్రకటించింది. మొత్తంగా 3,44,080 డబుల్​ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వ పరంగా నిధులు విడుదల చేయకపోడం, భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఈ లక్ష్యం చేరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్రం సాయంతో..

పేదలకు సొంతింటిని సమకూర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్​ యోజన(పీఎంఏవై) పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వాలు 40% వంతున ఖర్చు చేసేలా ఈ స్కీమ్ ను రూపొందించింది. 2020–21 ఫైనాన్షియల్​ ఇయర్​ప్లాన్​ప్రకారం రూరల్​ ఏరియాలో రూ.3,150 కోట్లతో, అర్బన్​ ఏరియాలో రూ.3,850 కోట్లతో డబుల్​ ఇండ్లను నిర్మించాలని, మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2020–-21లో రూరల్​ ఏరియాల్లో నిర్మించనున్న 25,479 డబుల్​ఇండ్ల కోసం ఒక్కో ఇంటికి రూ.72 వేలు చొప్పున కేంద్రం ఇస్తుంది. అర్బన్​ ఏరియాల్లో నిర్మించనున్న 92,305 డబుల్​ ఇండ్ల కోసం ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల చొప్పున కేంద్రం నిధులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం రూరల్​ ఏరియాలో డబుల్​ ఇండ్ల నిర్మాణ వ్యయం రూ.5.04 లక్షలు, అర్బన్​లో రూ.5.30 లక్షలుగా ఉంది.

మూడేండ్ల ప్లాన్ ఇలా..

2018–19లో రాష్ట్రంలో 2,63,241 డబుల్​ ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 12,530 ఇండ్లే పూర్తయ్యాయి. 2019––‌‌-20లో రాష్ట్రంలో 2,83,401 డబుల్​ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా ఇండ్ల శాంక్షన్​ ఇచ్చింది. స్థలం కపోవడంతో 84,323 ఇండ్ల నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. శాంక్షన్​ అయిన వాటిలో 1,99,001 ఇండ్ల నిర్మాణం కోసమే టెండర్లు పిలిచారు. వీటిలో 1,79,078 ఇండ్ల నిర్మాణమే మొదలైంది. 39,321 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయి. రూ.74.94 కోట్లే ఖర్చు చేశారు. 2020‌‌–21లో రాష్ట్రంలో 3,44,080 డబుల్​ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రూరల్​ ఏరియాలో నిర్మాణంలో ఉన్న 38,241 ఇండ్లను, అర్బన్​ ఏరియాలో 29,652 ఇండ్లను కూడా పూర్తి చేయాలని టార్గెట్​గా పెట్టుకుంది.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కవిత

Latest Updates