అమీర్ పేటలో నిలిచిపోయిన ఫుట్ బ్రిడ్జి నిర్మాణం

హైదరాబాద్‌, వెలుగు: జంట నగరాల్లో రోజు రోజుకూ శరవేగంగా అభివృద్ధి చెందుతోన్నవాణిజ్య ప్రాంతాల్లో అమీర్‌ పేట ప్రధానమైంది .దశాబ్దాల క్రితం చిన్న చిన్న దుకాణాలకే పరిమితమైన ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధిలో దూసుకు పోతోంది . ప్రస్తుతం రహదారికి ఇరువైపులా ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల భవనాలు, పేరెన్నిక గన్న వ్యాపార సముదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. ఎటు చూసినా జనం రద్దీతో అమీర్‌ పేట కిటకిటలాడుతుంది . పగలు,రాత్రి అనే తేడా లేకుండా జనసమ్మర్ధం రహదారులపై ఉంటుంది . అమీర్‌ పేటలోని జాతీయ రహదారి గుండా గంటకు వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ రోడ్డు దాటాలంటే పాదచారులు చాలాఇబ్బందులు పడాల్సి వస్తోంది . ఇంతకు ముందు మెట్రో రైల్‌ పిల్లర్ల నిర్మాణం జరగక ముందు సులువుగానే రోడ్డు దాటే వెసులుబాటు ఉండేది.మెట్రో రైల్‌ నిర్మాణ పనుల్లో భాగంగా ఇక్కడ డివైడర్లు నిర్మించి… రోడ్డు దాటేందుకు అక్కడక్కడా ఖాళీలు వదిలారు. నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే ఈ ఖాళీల మధ్య నుంచి పాదచారులు రోడ్డు దాటాల్సి వస్తోంది . దీనికి పరిష్కారంగా ఇక్కడ రోడ్డుకు అడ్డంగా పాదచారుల వంతెన నిర్మించాలని హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ… జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు.

మెట్రోరైల్‌ వంతెన కింద నుంచి పాదచారుల వంతెన వచ్చేలా ప్రణాళికలు రచించారు. రహదారులు రద్దీగా ఉండి.. పాదచారులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్న పలు ప్రాంతాలను గుర్తించి జీహెచ్ఎంసీ ఈ రకమైన పాదచారుల వంతెనలు నిర్మించింది . నగరంలోని పలుచోట్ల ఈ తరహా వంతెనలు సేవలందిస్తున్నా యి. అదేవిధంగా అమీర్‌ పేటలో కూడా సుమారు ఏడాది క్రితం పాదచారుల వంతెన నిర్మా ణ పనులు ప్రారంభించారు. అయితే వంతెన నిర్మిస్తే తమ దుకాణాలకు అడ్డంగా ఉంటుందని.. తమ వ్యాపారాలు తగ్గి నష్టపోతామని పలువురు  దుకాణదారులున్యాయస్థానానికి వెళ్లి స్టే ఆర్డర్‌ తీసుకొచ్చి పనులు ఆపించేశారు. ఈ స్టే ఆర్డర్‌ వెకేట్‌ చేయడం కోసం జీహెచ్ఎంసీ అధికారులు కౌంటర్‌ ఫైల్‌ చేశారు.వచ్చే వారం స్టే వెకేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని .. స్టే వెకేట్‌ కాగానే వంతెన నిర్మా ణ పనులు ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారి ముషారఫ్‌ అలీ వెల్లడించారు. ఇక్కడ పాదచారుల వంతెన నిర్మా ణం పూర్తయితే రద్దీగా ఉండేరహదారిని దాటేందుకు పాదచారులకు సౌకర్యం కలుగుతుంది . వంతెన నిర్మా ణం ప్రారంభమైతే త్వరిత గతిన పనులు పూర్తవుతాయని… రోడ్డుదాటేందుకు సులువుగా ఉంటుందని పాదచారులు అభిప్రాయపడుతున్నారు.

 

 

Latest Updates