ప్రాణాలకు తెగించి ఫ్యామిలీని కాపాడిన పోలీసులు

హైదరాబాద్ : జలదిగ్బంధంలో ఉన్న వారిని ప్రాణాలకు తెగించి కాపాడారు రాజేంద్రనగర్ పోలీసులు. భారీ వర్షాలతో పలు కాలనీలు నీటిలో మునిగాయి. బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని మైపాల్ టౌన్ పక్కనున్న ఓ ఫ్యామిలీ వాగులో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ CI సురేష్, SI బల్ రాజ్, కానిస్టేబుల్స్..వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. నీటిలో చిక్కుకుపోయిన వారిని తాడు సహాయంతో ప్రాణాలకు తెగించి కాపాడారు.

వరద నీరు ఉధృతంగా రావడంతో వారిని రక్షించడం చాలా కష్టంమైందని పోలీసులు తెలిపారు. ఒక సంవత్సరం బాబును భుజాలకు కట్టుకొని, తాడు సహాయంతో బయటికి తీసుకురావడం చాలా కష్టమైందని తెలిపారు పోలీసులు. అలాగే వాగు పక్కనే ఉన్న వారిని వాలంటీర్స్ సాయంతో సురక్షిత ప్రాంతానికి పంపించామన్నారు. పోలీసులు చేసిన ఈ సాహసానికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. హిమాయత్ సాగర్ గేట్ లు ఓపెన్ చేయడంతో వాటర్ పొంగిపొర్లుతున్నాయని తెలిపిన పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Latest Updates