సూర్యరశ్మి, వేడిని కరోనా వైరస్ తట్టుకోలేదు

సూర్యరశ్మి, వేడి ప్రాంతాల్లో కరోనా వైరస్ తన సామర్ధ్యాన్ని కోల్పోతుందని అమెరికా సైంటిస్ట్ లు చెబుతున్నారు.

వేడి ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం చూపదన్నఅనుమానాల్ని నివృత్తి చేసేందుకు పరిశోధనలు చేశారు. పరిశోధనల్లో కరోనా సూర్యరశ్మి, వేడిని తట్టుకోలేదని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ హెడ్ విలియం బ్రయాన్ అన్నారు. సూర్యరశ్మి వల్ల కరోనా చచ్చిపోతుందని వైట్ హౌస్ మీడియా సమావేశంలో తెలిపారు.  “ప్రత్యక్ష సూర్యకాంతి సమక్షంలో వైరస్ వేగంగా చనిపోతుందున్న ఆయన .. వేడి ఎక్కువగా ఉంటే వ్యాధులు సోకే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు తమపరిశోధనల్లో తేలిందన్నారు.  సింగపూర్ వంటి వేడి దేశాల్లో కరోనా తన శక్తిని కోల్పోతున్నట్లు రుజువైందన్నారు.

Latest Updates