పెద్దలు ఒప్పుకోలేద‌ని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ ప్రేమజంట

చిత్తూరు జిల్లా కుప్పం-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో విషాదం జ‌రిగింది. ఓ ప్రేమ జంట వ్య‌వ‌సాయ నీటికుంట‌లో ప‌డి మృతి చెందారు. కోలార్ జిల్లా బంగారుపేట మండలం , ముగిలబెలి గ్రామానికి చెందిన‌ ప్రేమజంట త‌మ‌ ప్రేమను పెద్దలు నిరాకరించార‌ని ప్రాణాలు తీసుకున్నారు. మాదమంగల గ్రామానికి చెందిన సురేష్(28) మరియు కరహళ్లి గ్రామానికి చెందిన రూప(26) లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే సురేష్ ద‌ళిత కుటుంబానికి, రూప బీసీ కులానికి చెందిన వారు కావ‌డంతో ఇరు కుటుంబ పెద్దలు వారి ప్రేమ‌ను నిరాకరించారు. దీంతో వారు వ్యవసాయ నీటి కుంటలో పడి మృతి చెందారు

Latest Updates