‘సమత’ నిందితులకు లాయర్​ ను నియమించిన కోర్టు

ఆదిలాబాద్‍ అర్బన్‍, వెలుగు:  సమత కేసులో నిందితుల తరఫున లాయర్​ను కోర్టు నియమించింది. కేసులోని ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం మరోసారి జిల్లా జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు.  ప్రస్తుతం తాము లాయర్​ను నియమించుకునే పరిస్థితుల్లో లేమని, కోర్టు ద్వారానే నియమించాలని నిందితులు విన్నవించారు. వారి తరఫున వాదించవద్దని ఇప్పటికే బార్‍ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో నిందితులు కోరుకున్న అడ్వకేట్‍ ఎ.ఎ.రహీంను వారి తరఫున వాదించేందుకు స్టేట్‍ బ్రీఫ్‍గా నియమిస్తూ జడ్జి ఉత్తర్వులను జారీ చేశారు. రెండు రోజుల్లో కేసు విచారణకు సంబంధించిన షెడ్యూల్​ఫిక్స్ చేసి రోజుకు ఐదు నుంచి ఆరుగురు సాక్ష్యులను విచారించే అవకాశమున్నట్లుగా పీపీ రమణారెడ్డి తెలిపారు.

The court appointed Lawyer on behalf of the accused in the Samatha case.

Latest Updates