కేంద్రం ఇస్తామన్న పప్పు, గ్యాస్ ఇంకా రాలేదు

రిపబ్లిక్ టీవీ చానెల్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామీ సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాన‌న్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. చాలా దిగజారిన విధంగా చేసిన వ్యాఖ్యలపై కేసు ఫైల్ చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామ‌న్నారు. లాక్ డౌన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 12 కిలోల బియ్యం, 1500 రూపాయలు ఇంకా పేదలకు చేరలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యంలో క్వాలిటీ లేదపి.. ప్రజలు తినడం లేదని తెలిపారు. 12 కిలోల బియ్యంలో కేంద్రం ఇచ్చిన 5కిలోల బియ్యం కూడా ఉన్నాయా అనేదానిపై సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు.

కేంద్రం ఇస్తామన్న పప్పు, గ్యాస్ ఇంకా రాలేదని.. తెల్లకార్డు లేని వారికి కూడా అందజేయాలన్నారు. వలస కూలీల విషయంలో ప్రభుత్వం మాటలకు ఆచరణకు పొంతన లేదని..ఉపాధి హామీ ఫిల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి చేర్చుకోవాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలోనూ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గొనె సంచుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని.. బత్తాయి, నిమ్మ ఎగుమతుల విషయంలోనూ ఆటంకాలు లేకుండా చూడాలన్నారు.

బత్తాయి ఢిల్లీకి ఎగుమతులు అయ్యేవి కావని.. రాష్ట్ర ప్రభుత్వమే రూ. 200 కోట్లు వెచ్చించి బత్తాయిని కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వాలన్నారు. ప్రపంచంలో కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్నదని..ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ట్రిపుల్ ట్రీ సూత్రం అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య భారీగా పెంచాలన్నారు. కరోనా వ్యాప్తికి మతపరమైన రంగు పూయొద్దని..కొన్ని పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Latest Updates