చెట్టు కొమ్మకు చీర..కుళ్లిన మహిళ మృతదేహం

అదృశ్యమైన మహిళ శవమై కనిపించింది. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. వివరాలు : మెదక్ జిల్లా మంబోజిపల్లి గ్రామానికి చెందిన ఉప్పు పోచమ్మ(30) భర్తతో విడాకులు తీసుకుని కొడుకుతో నివాసం ఉంటుంది. అయితే నవంబర్ 3న పోచమ్మ భర్త వచ్చి ఆమెను తీసుకెళ్లాడని స్థానికులు తెలిపారు. అదే రోజు నుంచి కూతురు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పోచమ్మ తల్లిదండ్రులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం రామంతపూర్ గ్రామ శివారులో చెట్ల పొదల్లో మహిళ మృతదేహం గుర్తించిన స్థానికులు.. పోలీసులకు తెలిపారు.

చెట్టు కొమ్మకు మహిళ చీర కట్టి ఉంది …మహిళ మృతదేహం కుళ్ళి పోయింది. ఎముకలు మాత్రమే మిగిలాయి. పదిహేను రోజుల క్రితం మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ అల్లుడు నర్సింహులే కూతురిని చంపాడని కన్నీరుమున్నీరయ్యారు మృతురాలి తల్లిదండ్రులు. డెడ్ బాడీనీ పోస్ట్ మార్టమ్ కోసం హస్పిటల్ కి తరలించామని పూర్తి వివరాలు విచారణ తర్వాత తెలుపుతామన్నారు పోలీసులు.

Latest Updates