రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.2.80 లక్షల కోట్లు

హైదరాబాద్​, వెలుగు: బడ్జెట్ సైజ్‌ తగ్గినా … అప్పుల మోత మాత్రం మోగింది. రాష్ట్ర బడ్జెట్ మొత్తంతో పోలిస్తే ఇంచుమించుగా అప్పులు డబులయ్యాయి . ఈ ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు రూ.2.03 లక్షల కోట్లకు చేరింది. వీటితోపాటు మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర కార్పొరేషన్ల పేరిట మరో రూ.77,314 కోట్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. వివిధ కార్పొరేషన్ల పేరిట తీసుకున్న ఈ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత చివరకు ప్రభుత్వంపైనే ఉంటుంది. ఈ అప్పులన్నీ తడిసి మోపెడవుతున్నాయి .

వీటిని సైతం పరిగణనలోకి తీసుకుంటే మొత్తం అప్పు రూ.2.80 లక్షల కోట్లకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి మూడో టీఎంసీ ఎత్తిపోసేందు కు ఇటీవలే ఆర్ఈసీ నుంచి రూ.18,751 కోట్ల అప్పు తీసుకుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్​ కార్పొరేషన్​ పేరిట చేసిన ఈ అప్పును ప్రభుత్వం బడ్జెట్ లో చూపించలేదు. ఈ లెక్కన బడ్జెట్ తో పోలిస్తే అప్పులు డబులయ్యాయి. నిబంధనల ప్రకారం రాష్ట్ర అప్పు జీఎస్‌‌‌‌డీపీలో 25శాతం మించకూడదు. అంతకు మించితే ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాల జాబితాలో చేరి పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం అప్పులు జీఎస్‌‌‌‌డీపీలో21.39 శాతానికి చేరనున్నాయి . తెలంగాణ రాష్ట్రం ఏర్పడే టప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి పంచుకున్నఅప్పు రూ.70 వేల కోట్లు . గడిచి న నాలుగేళ్లలో ఈఅప్పు 4 రెట్లు పెరిగిపోవటం గమనార్హం.

వడ్డీలకే 14 వేల కోట్లు!

2016–17లో రాష్ట్ర ప్రభుత్వం రూ.8,609 కోట్లవడ్డీలు చెల్లించి నట్లు అకౌంటెంట్‌‌‌‌ జనరల్‌‌‌‌ తెలిపింది.2017–18లో వడ్డీల చెల్లిం పులకు రూ.11,138కోట్లు వెచ్చింది. సవరణ బడ్జెట్‌‌‌‌లోనూ ఇవే గణాంకా-లున్నాయి . వచ్చే ఏడాది ఈ వడ్డీల భారం రూ.14 వేలకోట్లు దాటనుంది.

The debt of the state government this year is Rs.2.80 crores

Latest Updates