భవన నిర్మాణ కార్మికులకు 5వేల ఆర్ధిక సాయం

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్ డౌన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారిని ఢిల్లీ ప్రభుత్వం ఆదుకోనుంది. ఇందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు ఆర్ధిక సాయం కింద 5వేలు ప్రకటించింది.

ఢిల్లీ కార్మిక శాఖ మంత్రి గోపాల్ రాయ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలో పనిచేస్తున్న సుతారీ మేస్త్రీలు, కూలీలకు ఆర్ధిక సాయం చేసేలా నిర్ణయం తీసుకున్నారు.

ఆర్ధిక సాయం కోసం ఎదురు చూస్తున్న కార్మికులు సంబంధిత వెబ్ సైట్ లో తమ వివరాల్ని నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకున్న కార్మికులకు ఆర్ధిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.  కార్మిక శాఖ మంత్రి హామీతో ఇప్పటి వరకు 40వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Latest Updates