‘కుక్క బాగుందని ఎత్తుకెళ్లారు.. యజమాని ఫ్లెక్సీ ప్రకటన చూసి….

సిద్దిపేట, వెలుగు: కుక్క బాగుందని ముచ్చటపడిన దుండగులు ఎవరూ లేని సమయంలో అదను చూసి ఎత్తుకెళ్లారు. పెంచుకున్న యజమాని పరిస్థితిని చూసి జాలిపడి కరిగిపోయారు. పెంచిన ప్రేమ ఎంత గొప్పదో గుర్తించి తీసుకెళ్లిన కుక్కను తిరిగి వదిలిపెట్టి వెళ్లారు. సిద్దిపేటలో జరిగిన ఈ ఘటన.. కుక్కను పెంచుకున్న యజమాని పెట్టిన ఫ్లెక్సీ ప్రకటన.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

తాము ఎంతగానో ప్రేమగా పెంచుకున్న కుక్క (పోలో)ను వారం రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తు ల ఎత్తు కెళ్లడంతో పట్టణానికి చెందిన దుశ్యం త్‌ రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. ఎక్కడికి వెళ్లిందో తెలియక కుంగిపోయాడు. మరుసటి రోజు ‘కనబడటం లేదు’ అంటూ సిద్దిపేట ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు పెట్టాడు. అయితే ఫ్లెక్సీలను చూసిన వారు ఎత్తు కెళ్లిన కుక్కను దుశ్యం త్‌ రెడ్డి ఇంటి ప్రాంతంలో వదిలెళ్లారు . ఆయన చేసిన పనికి స్థానికుల్లో ఆశ్చర్యం కలిగిం చినా.. చివరకు ‘పోలో’ ఇంటికి చేరడంతో ఆ కుటుంబం సంతోషం అంతా ఇంతా కాదు.

Latest Updates