జెట్ కు తొలిరోజు నిరాశే..

జెట్ ఎయిర్ వేస్ బిడ్డింగ్ ప్రాసెస్ కు తొలిరోజే నిరాశ ఎదురైంది. ఆర్థిక కష్టాల్లో ఉన్నజెట్ఎయిర్‌ వేస్ లో వాటాలు కొనేందుకు ఏ బిడ్డర్ కూడా సోమవారం ముందుకు రాలేదు. లెండర్స్‌‌‌‌ కన్సార్షియం ఎస్‌‌‌‌బీఐ ఈ ఎయిర్‌ లైన్స్​లో 32.1 శాతం నుంచి 75 శాతం వరకు ఓనర్‌ షిప్ ఆఫర్ చేసినాకూడా తొలి రోజు బిడ్డర్లు ఎవరూ ఆసక్తి చూపలేదు. జెట్ ఎయిర్‌ వేస్ బిడ్డింగ్ ప్రాసెస్‌‌‌‌ సోమవారం(ఈ నెల8) నుంచి ప్రారంభమైంది. బుధవారం( ఈ నెల 10)సాయంత్రం 6 గంటలకు ఆసక్తి వ్యక్తీ కరణ(ఈఓఐ)ముగుస్తుంది. రిపోర్టుల ప్రకారం జెట్ రెజల్యూషన్ కోసం బ్యాంక్‌ లు మళ్లీ జెట్‌‌‌‌ అతిపెద్ద వాటాదారు ఎతిహాద్ ఎయిర్‌ వేస్‌‌‌‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటీ ఈక్విటీ ఇన్వెస్టర్లు టీపీజీ, వెల్త్ ఫండ్ఎన్‌‌‌‌ఐఐఎఫ్(నేషనల్ ఇన్‌‌‌‌ఫ్రాక్ట్చ్రర్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ఫండ్), అమెరికాకు చెందిన ఎయిర్‌ లైన్ కంపెనీలు,టాటా గ్రూప్, అదానీ గ్రూప్‌‌‌‌లతో కూడా లెండర్లు సంప్రదింపులు జరిపాయని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టుచేసిం ది. మరోవైపు ఎతిహాద్‌‌‌‌ సంబంధిత సంస్థకు జెట్‌‌‌‌ ఎయిర్‌ వేస్ వడ్డీలు చెల్లించడంలో విఫలమైంది. ఈఎయిర్‌ లైన్‌‌‌‌కు ఎతిహాద్‌‌‌‌ నిధులు సమకూర్చడానికిఈఏ పార్టనర్స్‌‌‌‌ 1 పేరుతో 2015లో ఒక సంస్థను ఏర్పాటు చేసింది. లిక్విడిటీ సమస్యలతో మార్చి 19న చెల్లించాల్సి న పేమెంట్లను జెట్‌‌‌‌ దీనికి చెల్లించలేదు.ఈఏ పార్టనర్స్ 1, ఈఏ పార్టనర్స్ 2 అనే రెండు సంస్థలను ఎతిహాద్ ఏర్పాటు చేసింది. పలు ఎయిర్‌ లైన్స్ కోసం  నిధులను సేకరించడం కోసం 1.2 బిలియన్ డాలర్ల  బాండ్లను ఎతిహాద్ విక్రయించింది. ఈసంస్థల ద్వారా ఎయిర్‌ లైన్స్‌‌‌‌కు ఫైనాన్సింగ్ ఇవ్వడమేకాకుండా.. అబుదాబికి చెందిన ఈ కంపెనీ బ్యాలెన్స్ షీటుపై పడే భారాన్ని కూడా తగ్గించనుంది.

Latest Updates