రేట్లు తక్కువున్నా..ఈ 8 సిటీల్లో ఇండ్లు కొంటలేరు

దేశంలోని 8 ప్రధాన నగరాల్లో తక్కువ, మధ్యస్థాయి ధరలున్న ఇండ్లకు గిరాకీ పడిపోయిందట. ఇండ్లను కొనేటోళ్లు రేట్ ఎక్కువున్న ఇండ్లనే కొంటున్నారట. లేకుంటే రెంట్ హౌజ్‌‌‌‌కే ఓటు వేస్తున్నారట. మొత్తంగా హైదరాబాద్ సహా 8 ప్రధాన నగరాల్లో మిడ్‌‌‌‌ సెగ్మెంట్ ఇండ్లు, అందుబాటు ధరల్లోనే దొర్కుతున్న ఇండ్లూ అమ్ముడుపోతలేవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది.

అమ్ముడుపోని ఇండ్ల వ్యాల్యూ..1.4 లక్షల కోట్లు 

నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సీఆర్), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), బెంగళూర్, హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్‌‌‌‌కతా, అహ్మదాబాద్ సిటీల్లో కలిపి మొత్తంగా 40% ఇండ్లు అమ్ముడుపోలేదని కేంద్రం తన నివేదికలో తెలిపింది. అన్ని సిటీల్లో కలిపి 2,202 హౌజింగ్ ప్రాజెక్టులలో రియల్టర్లు 4.6 లక్షల ఇండ్లను కట్టారని, వీటిలో 1.8 లక్షల ఇండ్లు అమ్ముడుపోలేదని కేంద్రం విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. మొత్తం ఇండ్ల విలువ రూ. 3.3 లక్షల కోట్లు ఉండగా, అమ్ముడుపోని ఇండ్ల విలువ రూ.1.4 లక్షల కోట్ల వరకూ ఉంటుందని వెల్లడైంది. ఏరియా పరంగా చూస్తే అన్ని ఇండ్లు కలిపి 58.2 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, అందులో 22.5 కోట్ల చదరపు అడుగుల ఏరియా (ఇండ్లు)ను ఎవరూ కొనలేదని తేలింది.

మూడు సిటీల్లోనే 1.2 లక్షల ఇండ్లు మిగిలినయ్

సిటీ పరంగా చూస్తే, ఎంఎంఆర్‌‌‌‌లో 53%, బెంగళూరులో 52% యూనిట్లను ఎవరూ కొనలేదు. ఎన్ సీఆర్‌‌‌‌లో 24% ఇండ్లు అమ్ముడుపోలేదు. మొత్తం అమ్ముడుపోని ఇండ్లల్లో 1.2 లక్షల ఇండ్లు ఈ మూడు సిటీల్లోనే ఉన్నాయట. హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్‌‌‌‌కతా, అహ్మదాబాద్ సిటీల్లోనూ మిడ్‌‌‌‌ సెగ్మెంట్ ఇండ్లు అమ్ముడుపోలేదు. అయినా, పై మూడు సిటీలతో పోల్చిచూస్తే ఇది చాలా తక్కువని వెల్లడైంది. ఈ టైర్ టూ సిటీల్లో మొత్తంగా 59 వేల యూనిట్లు అందుబాటులోకి రాగా, 32,989 యూనిట్లు అమ్ముడుపోయాయని, రూ. 12,759 కోట్ల విలువైన 26,390 యూనిట్లు అమ్ముడుపోలేదని తేలింది.

Latest Updates